Burning Topic: ఇది రా మోడీ పవర్ అంటే.. ఊపిరి పిల్చుకో ఇండియా

Burning Topic: ప్రధాని నరేంద్ర మోడీ ఐదు దేశాల పర్యటనలో భాగంగా యూఏఈ, నెదర్లాండ్స్‌లో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

Update: 2026-05-17 00:50 GMT

Burning Topic: ఇది రా మోడీ పవర్ అంటే.. ఊపిరి పిల్చుకో ఇండియా

Burning Topic: ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నేపథ్యంలో భారత ఇంధన అవసరాలను తీర్చే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన చేపట్టారు. తన పర్యటనలో భాగంగా ముందుగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ చేరుకున్నారు. మోదీ విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత ఆ దేశానికి చెందిన ఎఫ్‌–16 యుద్ధ విమానం ఎయిర్‌పోర్టు దాకా ఎస్కార్ట్‌గా గౌరవాన్ని చాటుకుంది.

అబుదాబీ విమానాశ్రయంలో యూఏకీ అధ్యక్షుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌–నహ్యాన్‌ స్వయంగా స్వాగతం పలికి మోదీ పట్ల తన ఆత్మీయతను చాటుకున్నారు. మోదీ పర్యటనకు యూఏఈ ప్రభుత్వం అధిక ప్రాధాన్యంని ఇది స్పష్టం చేస్తోంది. ఆ తర్వాత ఇద్దరు నాయకులు భారత్‌–యూఏఈ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించుకున్నారు. భారత్‌కు ఇంధన భద్రత కల్పించడంతోపాటు రక్షణ, సాంకేతిక రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా కీలక ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి.

తన యూఏఈ పర్యటనలో భాగంగా మొత్తం ఏడు రంగాల్లో వ్యూహాత్మక సహకార ఒప్పందాలపై సంతకాలు జరిగాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇంధనం, రక్షణ, మౌలిక సదుపాయాలు, షిప్పింగ్, అధునాతన సాంకేతికత వంటి రంగాల్లో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. భారత్‌–యూఏఈ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై అల్‌ నహ్యాన్‌తో చర్చించానని పేర్కొన్నారు.

భారత్‌లో 5 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ ముందుకొచ్చిందని వెల్లడించారు. భారత్‌లో ఏఐ పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లడమే ధ్యేయంగా ఒక సూపర్‌ కంప్యూటర్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నారు. పశ్చిమాసియాలో శాంతి సాధనకు సహకరించడానికి భారత్‌ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ ప్రకటించారు. యూఏఈపై ఇరాన్‌ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అరబ్‌ ఎమిరేట్స్‌ను లక్ష్యంగా చేసుకోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టంచేశారు.

భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను పరిరక్షించే బాధ్యత కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ స్ట్రాటజిక్‌ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్‌ వ్యూహాత్మక సహకారమే లక్ష్యంగా అబుదాబీ నేషనల్‌ ఆయిల్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. పెట్రోలియం నిల్వలను పెంపొందించడంతోపాటు ఎల్‌ఎన్‌జీ, ఎల్పీజీ నిల్వలను బలోపేతం చేయడానికి అబూదాబీ సంస్థ సహకరిస్తుంది. ఇండియాకు ఎల్పీజీ దీర్ఘకాలిక సరఫరా,

ఆర్థిక స్థిరత్వం, ఇంధన భాగస్వామ్యం లక్ష్యంగా ఎల్పీజీ రంగంలో వ్యూహాత్మక సహకార ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రక్షణ పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేయడం, నూతనఆవిష్కరణలను ప్రోత్సహించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం, జాతీయ, ప్రాంతీయ భద్రతను పటిష్టం చేయడం లక్ష్యంగా వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌పైనా సంతకాలు చేశారు. ఈ పర్యటన ఫలితాలు ఇరుదేశాల స్నేహాన్ని మరింత బలోపేతం చేసి, అభివృద్ధి శ్రేయస్సుకు దోహదపడతాయని విశ్వసిస్తున్నట్లు మోదీ తెలిపారు.

Full View


Tags:    

Similar News