Burning Topic: బిచ్చగాళ్ళను బతిమిలాడుతున్న పాకిస్తాన్!
Burning Topic: ఉమ్రా హజ్ ముసుగులో గల్ఫ్‌లో భిక్షాటన చేస్తున్న పాకిస్థానీలపై ఆ దేశ ప్రభుత్వం సీరియస్ అయింది నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది.
Burning Topic: బిచ్చగాళ్ళను బతిమిలాడుతున్న పాకిస్తాన్!
Burning Topic: మింగ మెతుకు లేదు, మీసాలకు సంపన్న నూనె అన్నట్లుంది పాకిస్థాన్ పని. గోధుమ పిండికి కూడా గతి లేనంతగా దిజారిన ఆర్థిక వ్యవస్థ కాపాడుకునేందుకు ఆ దేశ పాలకులు అప్పుల కోసం నానా తంటాలు పడుతున్నారు. ఏమీ లేకున్నా బయటకు శాంతి దూతగా అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లో జోక్యం చేసుకుంది.
అదే సమయంలో తమ దేశానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని బేరం పెట్టింది. ఇటీవల ఖతార్ దేశం తమకు బకాయిగా ఉన్న రుణాన్ని ముక్కు పిండి మరీ పాకిస్థాన్ నుంచి వసూలు చేసుకునే ప్రయత్నం చేయగా, సకాలంలో సౌదీ అరేబియా దయతలచి ఆదుకుంది.
తమ దేశ నాయకులే ప్రపంచ దేశాల దగ్గర అడుక్కుంటుంటే తాము ఎంత అని భావిస్తున్నారేమో పాకిస్థాన్ ప్రజలు వారు కూడా అదే బాట పట్టారు. భారత్ సహా అనేక దేశాల నుంచి ఉపాధి అవకాశాల కోసం గల్ఫ్ దేశాలకు వెళుతుంటే, పాకిస్థానీలు మాత్రం భిక్షాటన కోసం ఆయా దేశాలకు పోతున్నారు
ఇలా భిక్షాటన కోసం వచ్చిన పాకిస్థానీలు గల్ఫ్ దేశాలకు కష్టాలు తెచ్చిపెడుతున్నారు. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ దేశాల వీధుల్లో కనిపించే పాకిస్థానీలు అక్కడి ప్రభుత్వాలను చికాకు పెడుతున్నారు.
దుబాయ్, అబుదాబి, దోహా, రియాద్, జెద్దా నగరాలతో పాటు మక్కా, మదీనా లాంటి పవిత్ర క్షేత్రాల్లో కూడా అడుక్కునే పాకిస్థానీలు పెద్ద న్యూసెన్స్ అయిపోయారు.భిక్షాటనే పరమితం కాకుండా నేరాలకు పాల్పడుతున్నారు. పర్యాటకులుగా వచ్చిన అమ్మాయిను వేధిస్తూ, రహస్యంగా ఫోటోలు తీస్తూ దొరికిపోతున్నారట.
ఈ పాకిస్తానీలు పెద్ద సమస్యగా మారిపోవడంతో కఠినంగా వ్యవహరించక తప్పదు అని నిర్ణయించుకున్నాయి అరబ్ దేశాలను. వీరికి నిర్బందించి జైళ్లలో మేపడంకన్నా తిరిగి పాకిస్తాన్కు పంపడమే మంచిదని నిర్ణయించుకున్నాయి గల్ఫ్ దేశాలు.. ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ దేశాలు పాకిస్తానీలపై కొరడా జుళిపిస్తున్నాయి. వారిని వారిని వెనక్కి పంపేస్తున్నాయి
గల్ఫ్ దేశాల్లో కనిపించే యాచకుల్లో 90 % మంది పాకిస్థానీలే అని గుర్తించారు. ఆయా దేశాలు ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వానికి తమ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. తీర్థయాత్రల ముసుగులో ఉమ్రా వీసాలపై వెళ్లి అక్కడ యాచక వృత్తిలో కొనసాగుతున్నారు. మక్కాలో హజ్ యాత్ర సమయంలో ఇలాంటి వారంతా పెద్ద న్యూసెన్స్ అయిపోతున్నారని అక్కడి అధికారులు తలపట్టుకుంటున్నారు.
సౌదీ అరేబియా గత ఏడాది దాదాపు 56 వేల మంది పాకిస్థానీ బిచ్చగాళ్లను స్వదేశానికి పంపించింది. యూఏఈ నుంచి 6 వేల మంది, అజర్‌బైజాన్ నుంచి 2,500 మంది వెనక్కి పంపారు ఉమ్రా వీసాలను భిక్షాటన కోసం దుర్వినియోగం చేయొద్దని 2024లో పాకిస్థాన్‌కు సౌదీ ఓ హెచ్చరిక జారీ చేసింది.
యాచకులను, రోగులను" పంపవద్దని వారిని నియంత్రించకపోతే వీసాలు నిలిపేయక తప్పదని తెలిపింది. దీంతో పాకిస్తాన్ పరువు అరేబియా సముద్రంలో కలిసినంత పనైంది. గల్ఫ్ దేశాల్లో తమ దేశ పౌరుల భిక్షాటన, వీసా నిబంధనల ఉల్లంఘన, అక్రమ వలసల వ్యవహారంతో పరువుపోతోందని గ్రహించింది పాకిస్థాన్ ప్రభుత్వం.
తాజాగా దిగ్గుబాటు చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా హజ్, ఉమ్రా యాత్రల పేరిట సౌదీ అరేబియాకు వెళ్లే తమ పౌరులు.. భిక్షాటనకు పాల్పడొద్దంటూ బతిమిలాడుకుంటోంది. పాకిస్థానీయులు కూడా స్థానిక చట్టాలను, తమ వీసా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సౌదీ అరేబియాలోని పాకిస్థాన్ ఎంబసీ సూచనలు జారీ చేసింది.
ముఖ్యంగా మక్కా, మదీనా పవిత్ర ప్రాంతాల పరిసరాల్లో భిక్షాటన, అనధికారికంగా విరాళాలు లేదా డబ్బులు సేకరించడంపై సౌదీ అధికారులు ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమలు చేస్తున్నారని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టు, నిర్బంధం, డిపోర్టేషన్ వంటి కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఇందు కోసం ఏఐ టూల్స్‌లో జారీ చేసిన ఓ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో ఓ వ్యక్తిని సౌదీ అధికారులు అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్నట్లు చూపించారు. స్థానిక చట్టాలను ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాలను ఈ వీడియో ద్వారా యాత్రికులకు వివరించారు.
అనుమతి లేని సేవలను వినియోగించుకోవద్దని, చట్టబద్ధమైన మార్గాల్లోనే ఆర్థిక సహాయం, విరాళాల సేకరణ చేపట్టాలని సూచించారు. దేశ పరువు దెబ్బతినేలా వ్యవహరించవద్దని తమ దేశ పౌరులకు పాకిస్థాన్ గట్టి సందేశం ఇచ్చింది.
పాకిస్థాన్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2025లో సౌదీ అరేబియా సహా గల్ఫ్ సహకార మండలి దేశాల నుంచి వివిధ కారణాలతో 38,616 మంది డిపోర్ట్ అయ్యారు. గల్ఫ్ దేశాల్లో సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం తమ దేశంలోనే అడ్డుకుంటోంది.
2025లో సరైన పత్రాలు లేకపోవడం, ఇమ్మిగ్రేషన్ సమస్యల కారణంగా 66,154 మందిని విమానాశ్రయాల్లోనే నిలిపివేసింది. బెగ్గింగ్ మాఫియా, అక్రమ వలసలకు సహకరిస్తున్న ఏజెంట్లపై కూడా దృష్టి పెట్టింది.
పాకిస్తాన్ ప్రపంచానికి టెర్రరిస్టులలే కాకుండా గాడిదలను. యాచకులను కూడా ఎగుమతి చేస్తోందని సోషల్ మీడియాలో జోక్స్ పేలుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఏ దేశానికి అప్పుకోసం వెళ్లినా.. ఆ దేశాల వీధుల్లో వారి పౌరులే అడుక్కుంటున్నారని సెటైర్స్ వినిపిస్తున్నాయి.. పాకిస్థాన్ బొక్కసంలో రొక్కం లేకున్నా ఆ దేశ పాలకుల దర్పానికేం తక్కువలేదు.
దేశాభివృద్ధిని గాలికి వదిలేసి తమ వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టుకోవడంపైనే ధ్యాస చూపిస్తున్నారు. పైగా పొరుగు దేశం భారత్ అభివృద్ధిని దెబ్బ తీసేందుకు సీమాంతర ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతూ సమస్యలు సృష్టిస్తున్నారు.
ఇందు కోసం అభివృద్ధి కార్యక్రమాల కోసం అంటూ ప్రపంచ ఆర్థిక సంస్థలు, విదేశాల నుంచి తెచ్చిన తెచ్చిన అప్పులన్నీ ఉగ్రవాదుల శిక్షణ కోసం ఖర్చు పెడుతున్నారు. అదే సమయంలో ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో సతమతం అవుతున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ సమాజంలో ఇమేజీ దెబ్బతినే పరిస్థితి వచ్చింది..