Off The Record: నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా?

Off The Record: "చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయ పోరు ముదిరింది. మంత్రి నారా లోకేష్ చేసిన అవినీతి ఆరోపణలపై వైసిపి నేత మోహిత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

Update: 2026-05-01 00:59 GMT

Off The Record: నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా?

Off The Record: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా చంద్రగిరి రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. మంత్రి నారా లోకేష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని నేరుగా టార్గెట్ చేశాయి. వైసీపీ హయాంలో చెవిరెడ్డి భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారని.. తుడా, స్మార్ట్ సిటీ నిధుల నుంచి మద్యం కుంభకోణం వరకు ఘాటు ఆరోపణలు చేశారు. చంద్రగిరి ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ శిబిరంలో కలకలం రేపాయి. దీనికి కౌంటర్‌గా రంగంలోకి దిగిన వైసీపీ చంద్రగిరి ఇన్‌చార్జ్ మోహిత్ రెడ్డి.. మంత్రి లోకేష్, పులివర్తి నానిపై ఫైర్ అయ్యారు. తమ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేయడం టీడీపీకి అలవాటైందని.. నిజంగా ధైర్యం ఉంటే కాణిపాకం వినాయకుడి సాక్షిగా ప్రమాణానికి రావాలని సవాల్ విసిరారు. లిక్కర్ స్కామ్‌లో తమ ప్రమేయం నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించడం రాజకీయంగా సంచలనం అయింది.

అక్కడితో ఆగకుండా పులివర్తి నాని గతాన్ని టార్గెట్ చేసిన మోహిత్ రెడ్డి.. క్వారీ అనుమతులు, స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ, భూ వ్యవహారాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు చెప్పుకుని లబ్ధి పొందలేదా..? ఇప్పుడు అదే పెద్దిరెడ్డి పేరును ఎందుకు టార్గెట్ చేస్తున్నారని నిలదీశారు. భూ కబ్జాల చిట్టా తమ వద్ద సిద్ధంగా ఉందని.. త్వరలో పుస్తకంగా బయటపెడతామని బాంబు పేల్చారు. మోహిత్ రెడ్డి సవాళ్లకు ఎమ్మెల్యే పులివర్తి నాని అంతకంటే ఘాటుగా స్పందించారు. మంత్రి లోకేష్ పేరు తీస్తే సహించబోమని.. బడిత పూజ తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే పులివర్తి నాని. చెవిరెడ్డి ఫ్యామిలీ అక్రమాల అసలు చరిత్రను బయటపెడతామని.. వారం రోజుల్లో రాజకీయ సినిమా చూపిస్తామని హెచ్చరించారు. తండ్రి పేరుతో రాజకీయాలు చేస్తూ అక్రమంగా సంపాదించారంటూ మోహిత్ రెడ్డిపై వ్యక్తిగత స్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే.

చంద్రగిరిలో ఇప్పుడు రాజకీయ పోరు.. కేవలం పార్టీల మధ్య కాదు.. వ్యక్తిగత ప్రతిష్ట, కుటుంబ ప్రభావం, భవిష్యత్ ఆధిపత్యం చుట్టూ తిరుగుతోంది. కాణిపాకం ప్రమాణం రాజకీయంగా కొత్త మలుపు తిప్పుతుందా..? అవినీతి ఆరోపణలు నిజంగా ఆధారాలతో బయటకు వస్తాయా..? లేక ఇది అంతా ఎన్నికల ముందస్తు వ్యూహమా..? అన్నదే నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చంద్రగిరి రాజకీయాల్లో మాటల మంట మరింత పెరుగుతోంది. సవాళ్లు ఎక్కడ ఆగుతాయి..? ప్రమాణాలు నిజంగా జరుగుతాయా..? లేక ఇవన్నీ రాజకీయ డ్రామాకే పరిమితమవుతాయా..? కానీ ఒక విషయం మాత్రం స్పష్టం.. చంద్రగిరిలో పొలిటికల్ ఫైట్ ఇక మరింత రసవత్తరంగా మారబోతోంది.


Full View

Tags:    

Similar News