Jordar Varthalu: లంచమిస్తేనే ఆటో దిగుతా.. ఆటో డ్రైవర్ కు లేడీ కానిస్టేబుల్ వార్నింగ్
Jordar Varthalu: ఆటో డ్రైవర్ నుంచి లంచం వసూలు చేస్తున్న లేడీ కానిస్టేబుల్ వీడియో వైరల్! నో పార్కింగ్ పేరుతో ఆటోలోనే కూర్చుని వేధింపులు.
Jordar Varthalu: లంచమిస్తేనే ఆటో దిగుతా.. ఆటో డ్రైవర్ కు లేడీ కానిస్టేబుల్ వార్నింగ్
Jordar Varthalu: ఛీ.. ఛీ.. ఏం మన్షుల్లుల్లా. పాపం.. పోలీసక్క ఎర్రటి ఎండల్ల రికాం లేకుంట డ్యూటీ చేశి, తినెతందుకు టైం దొర్కక ఆటోల బుక్కెడు సల్లవడ్దామని సమోసనో, బర్గరో తింటుంటె.. ఆమెను పట్టుకొని లంచగొండుల అధ్యక్షురాలని బద్నాం జేస్తున్నరని గరానికి రాకుర్రుల్లా. ఆమె సిన్సియర్గ ఆటోల డ్యూటీ జేస్తున్నది లంచం కోసమేనుల్లా. ఆటో డ్రైవరన్నను ఇడ్శిపెడ్తే, ఏడపోతడో అని.. ఆటోలనే కూసున్నది. ఐదోకంటికి తెల్వకుంట ఆటోలనే ఐదువందలు జేబులవెడ్తె హాయిగ ఇంటికి పోదామనుకున్నది. కనీ., ఆటోడ్రైవరన్న నిఘా నేత్రానికి శిక్కి దున్యానోటితోని లంచగొండని ముద్రేపిచ్చుకున్నది. బీహార్ దిక్కు జరిగింది. పాడై డ్రైవరన్న చౌరస్తా కాడ మంది కోసం, మేడంను సూడకుంట నిలవడ్డట్టున్నడు. ఇగ ఎంబటే ఎన్కనుంచి అచ్చి ఆటోల కూసున్నది. నో పార్కింగ్ జాగల బండివెట్టినందుకు ఐదువందలు కట్నం సద్వియ్యాల్నని పట్టువట్టింది. డ్రైవరన్న తాన సుతం పైసలు లేనట్టున్నయ్. వీడియో తీసుకుంటనే.. మేడం గన్ని పైసలు లెవ్వు, వందనన్న తక్వ జెయ్యుర్రని మస్తు బతిలాడుకున్నడు. మేడం నెమరేసుకుంట కుద్రదని అడ్డంగ తల్కాయ ఊపింది. తప్పుతె, అన్న మీద ఇసుమంత గూడ కనికరం సూపెట్టలేదు.
జేబులలేకుంటె, పైసలు ఫోన్లకు కొట్టిచ్చుకొని, ఎస్సై మేడాన్ని నిమ్మలం జేశిండు డ్రైవరన్న. అటెంక మేడంగారి లీలల రీల్ను ఇంటర్నెట్ల ఇడుస్తె, ఇర్గమర్గ వైరలైతున్నది. దీని మీద ఎంక్వైరీ ఛాల్జేశిర్రట అటు దిక్కుపోలీసోల్లు. దొంగకు శెప్పేలాభమన్నట్టు.. లంచగొండ్లకు ఎంత కంతే ఆసర కావచ్చు మరి. లంచగొండ్లు ఇంత కంటె దిగజారరనుకున్న ప్రతీ సారీ.. అంతకంటె దిగజారి, అంచనాలను అతలాకుతులం జేస్తున్నరని కామన్ పబ్లికు మస్తు కామెంట్లు జేస్తున్నరు. డిస్కౌంట్లు గూడ లేకుంట నిక్కచ్చిగ డ్యూటీ జేస్తున్నరని ఎడ్డియ్యవట్టిర్రు ఇంకొందరు జనాలు. జనాల రక్తాలను ఎండాకాలంల జ్యూస్ లెక్క తాగెతందుకు పుట్టినోల్లే ఈ లంచగొండ్లనుకుంట ఇంకొందరు సొట్లు వెడ్తున్నరు.