BurningTopic: భారత్ చేతిలో మరో బ్రహ్మాస్త్రం..శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న భారత్
BurningTopic: భారత రక్షణ రంగంలో మరో మహా మైలురాయి నమోదైంది. డీఆర్‌డీవో (DRDO) స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ (LRLACM) ప్రయోగం విజయవంతమైంది.
BurningTopic: భారత్ చేతిలో మరో బ్రహ్మాస్త్రం..శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న భారత్
BurningTopic: దేశ సైనిక బలగాలకు మరో అతి కీలక ఆయుధం అందించింది డీఆర్‌డీవో. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్‌ను ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి విజయవంతంగా పరీక్షించింది. దేశ క్షిపణి సామర్థ్యంలో ఇదో మైలురాయి. ప్రయోగానికి సంబంధించిన అన్ని లక్ష్యాలూ నెరవేరాయని రక్షణ శాఖ తెలిపింది. ఈ అస్త్రం.. ‘వే పాయింట్ నేవిగేషన్’ ద్వారా నిర్దేశిత మార్గంలో దూసుకెళ్లింది. భిన్న ఎత్తుల్లో, వేగాల్లో అద్భుత విన్యాసాలు చేయగల సామర్థ్యాన్ని చాటింది. తక్కువ ఎత్తులో పయనిస్తూ ప్రత్యర్థి రాడార్ల కంటపడకుండా తప్పించుకోవడం దీని ప్రత్యేకత.
భారత రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా సైన్యం అంబులపొదిలో మరో కీలక అస్త్రం చేరింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ LRLACM ను రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ DRDO విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. నిర్దిష్టమైన లక్ష్యాలను కచ్చితంగా ఛేదించే LRLACM .. భారత వ్యూహాత్మక దాడి సామర్థ్యాలకు మరింత బలం చేకూర్చనుంది. ఈ ప్రయోగంలో నిర్దేశించిన అన్ని లక్ష్యాలను క్షిపణి విజయవంతంగా చేరుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ పరిశోధన విభాగం వెల్లడించింది. ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం ఒక సబ్‌సోనిక్ ఉపరితల-ప్రయోగ క్రూయిజ్ క్షిపణి. ఇది చాలా దూరంలో ఉన్న భూభాగ లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
LRLACM క్షిపణి సుమారు 1,500 కిలోమీటర్ల వరకు ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగి ఉంది. స్వల్ప ఎత్తులోనే ప్రయాణిస్తూ శత్రు రాడార్లకు చిక్కకుండా సులభంగా లక్ష్యాలను చేరుకోవడం దీని ప్రత్యేకత. అవసరమైతే గగనతలంలోనే కాసేపు సంచరిస్తూ, లక్ష్యాన్ని గుర్తించిన తర్వాత అత్యంత కచ్చితత్వంతో దాడి చేయగల సామర్థ్యం దీని సొంతం. ఈ క్షిపణి సంప్రదాయ వార్‌హెడ్‌లు సహా అణు వార్‌హెడ్‌లనూ మోసుకెళ్లగలదని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో భూ ఆధారిత వ్యూహాత్మక దాడి వ్యవస్థల్లో భారత్ మరింత బలోపేతం కానుంది.. వివిధ ట్రాకింగ్, మానిటరింగ్ వ్యవస్థలు సేకరించిన డేటా ద్వారా కీలక సాంకేతిక పరిజ్ఞానాల పనితీరునూ ధ్రువీకరించినట్లు డీఆర్‌డీఓ తెలిపింది. ఈ విజయంతో భారత్ సుదీర్ఘమైన కచ్చిత దాడి సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుందని రక్షణ అధికారులు పేర్కొన్నారు. క్షిపణి అభివృద్ధిలో డీఆర్‌డీఓ సహా భారతీయ పరిశ్రమలూ కీలక పాత్ర పోషించాయన్నారు.
లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ LRLACM ప్రాజెక్ట్‌కు బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ ADE నోడల్ ల్యాబొరేటరీగా వ్యవహరించింది. ఈ క్షిపణి ప్రయోగాన్ని డీఆర్‌డీఓ సీనియర్ అధికారులు, భారత నౌకాదళం, భారత వైమానిక దళానికి చెందిన ప్రతినిధులు ప్రత్యక్షంగా వీక్షించారు.. క్షిపణి పరీక్ష విజయవంతం కావడంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేస్తూ.. డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు, భాగస్వాములను అభినందించారు. ఇది స్వావలంబన భారత్ లక్ష్య సాధనలో మరో కీలక ముందడుగని ఆయన పేర్కొన్నారు.రక్షణ శాఖ కార్యదర్శి, రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగం కార్యదర్శి, డీఆర్‌డీఓ ఛైర్మన్ రాజేష్ కుమార్ సింగ్ అన్ని కార్యకలాపాలను పర్యవేక్షించారు. క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఇతర బృంద సభ్యులను అభినందించారు. ఈ విజయంతో భారత్ స్వదేశీ క్షిపణి సాంకేతికతలో మరో కీలక మైలురాయిని అధిగమించింది.
ఈ విజయవంతమైన పరీక్షల్లో డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలతో పాటు రక్షణ పరిశ్రమ భాగస్వాముల సహకారం కీలక పాత్ర పోషించింది. సాంకేతిక అభివృద్ధి, రూపకల్పన, పరీక్షా ప్రక్రియల్లో సమన్వయం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని అధికారులు తెలిపారు. ఈ పరీక్షల విజయంతో భారత్ రక్షణ రంగంలో మరింత బలమైన స్థితికి చేరుకుంది. అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలను కలిగిన కొన్ని దేశాల జాబితాలో భారత్ స్థానం మరింత బలపడింది. డీఆర్‌డీఓ సాధించిన విజయాలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బృందాన్ని అభినందించారు. దేశ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ఈ పరీక్షలు కీలక మైలురాయిగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన వ్యవస్థలు భవిష్యత్ ముప్పులను ఎదుర్కొనేందుకు భారత్‌ను మరింత సిద్ధంగా ఉంచుతాయని ఆయన అన్నారు. బహుళ స్థాయి బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సామర్థ్యం విజయవంతంగా ప్రదర్శించినట్లు ఆయన వివరించారు.