Burning Topic: అభిషేక్ బెనర్జీ కి చుక్కలు చూపిస్తున్న బెంగాల్ ప్రజలు
Burning Topic: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి ఎదురుదెబ్బ. ఎంపీ అభిషేక్ బెనర్జీపై స్థానికుల దాడి. పార్టీలో అంతర్గత కక్షలు, ఎమ్మెల్యేల డుమ్మా.. మమతా బెనర్జీకి పెరిగిన చిక్కులు.
Burning Topic: అభిషేక్ బెనర్జీ కి చుక్కలు చూపిస్తున్న బెంగాల్ ప్రజలు
Burning Topic: పూలమ్మిన చోటే కట్టలమ్ముకోవడం అంటే కష్టమే.. పశ్చిమ బెంగాల్‌లో ఇటీవలి దాకా అధికారం అనుభవించి ఘోర పరాజయం తర్వాత విపక్షపాత్రకు పరిమితమైన తృణమాలు కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు అలాగే తయారైంది. బెంగాల్ ప్రజలు ఒకప్పుడు సుదీర్ఘ కమ్యూనిస్టుల పాలనకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టారు.. తాజా ఎన్నికల్లో ఆగ్రహంతో ఆ పార్టీని పాతాళానికి తొక్కేశారు. చిత్తు చిత్తుగా ఓడించినా బెంగాలీలకు ఇంకా టీఎంసీ మీద ఆగ్రహం తగ్గలేదు. దీంతో ఆ పార్టీ వారు ఎక్కడ కనబడితే అక్కడ దాడి చేస్తున్నారు. ఈ క్రమంలో మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీలో కీలక నాయకుడు. ఎంపీ అభిషేక్ బెనర్టీ వారికి టార్గెట్ అయ్యారు. సోనార్‌పుర్ ప్రాంతంలో ఓ కార్యకర్త నివాసానికి వెళ్లారు అభిషేక్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసలో బాధితులైన టీఎంసీ కార్యకర్తలను పరామర్శించేందుకు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సోనార్‌పుర్‌కు వెళ్లాయన. విషయం తెలిసిన కొందరు వ్యక్తులు ఆయన్ని రౌండప్ చేశారు.
అభిషేక్ బెనర్జీని చుట్టుముట్టిన చుట్టుముట్టిన స్థానికులు దొంగ, దొంగ అంటూ నినాదాలు చేస్తూ భౌతిక దాడికి ప్రయత్నించారు. దొంగ, దొంగ అంటూ నినాదాలు చేస్తూ భౌతిక దాడికి ప్రయత్నించారు. రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. ఈ క్రమంలో ఆయన చొక్కా చిరిగిపోయింది పోలీసు ఆయన్ని రక్షించేందుకు తమ మీద హెల్మెట్ వేయాల్సి వచ్చింది. ఒక దొంగ మరో దొంగను కలవడానికి వచ్చారని అభిషేక్‌ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. ఆర్జీకర్ హత్యాచార ఘటన జరిగినప్పుడు బాధితురాలి తల్లిదండ్రులను కలిశారా అని నిలదీశారు. పోలీసులు అతి కష్టం మీద ఆయన్ని అక్కడి నుంచి తప్పించాల్సి వచ్చింది. అయితే, ముందస్తు ప్రణాళిక ప్రకారమే తనపై దాడి జరిగిందని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ఈ ఘటన వెనక బీజేపీ నేతలు ఉన్నారని, తనపై దాడి జరుగుతున్నా పోలీసులు రక్షించలేదన్నారు.
ఎన్నికలు జరిగి కనీసం నెల రోజులు కూడా గడవకముందే బీజేపీ నాయకులు ఇలా చేస్తున్నారని విమర్శించారు అభిషేక్ బెనర్జీ. తన రాజకీయ ప్రత్యర్థులను హత్య చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. మరోవైపు అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడిపై టీఎంసీ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఈ దాడి వెనుక బీజేపీ హస్తం ఉందని అభిషేక్‌కు హెల్మెట్ పెట్టకపోయి ఉంటే ఆయన చనిపోయి ఉండేవాడని అన్నారు. రాళ్లు విసరడం, శారీరకంగా దాడి చేయడం వల్ల తన మేనల్లుడి ఛాతీ, పక్కటెముకల ప్రాంతంలో గాయాలయ్యాయని పేర్కొన్నారు. అభిషేక్‌కు సరైన చికిత్స అందించకుండా ఉండేందుకు ఆస్పత్రులపై పైనుంచి ఒత్తిడి ఉందని విమర్శించారు. ఆస్పత్రికి వచ్చినవారిలో ఎవరికి చికిత్స చేయాలి? ఎవరికి చేయకూడదు? అనే దానికి బీజేపీ నుంచి అనుమతి కావాలా అని మండిపడ్డారు.
కాగా ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ స్పష్టం చేసింది. అభిషేక్ మీద జరిగిన దాడి సొంత పార్టీలోని వర్గపోరు, టీఎంసీ అంతర్గత కక్షల ఫలితమేనని బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మావవీయ ఆరోపించారు.మరోవైపు పోలీసులు అభిషేక్ బెనర్జీ మీద దాడి చేసి కేసులో తపన్ మైతి, ఆకాశ్ గాయెన్, కాజల్ దాస్, దేవాశిష్ దత్తా, నిర్మాల్య సెంగుప్తా అలియాస్ జాయ్ అనే వ్యక్తులను అరెస్టు చేశారు. అయితే వీరిలో కొందరికి సోనార్‌పూర్ మాజీ టీఎంసీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే పోలీసులు కావాలని వీరిని అరెస్టు చేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.దర్యాప్తు సంస్థలు ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతూ, దాడి వెనుక ఉన్న అసలు కారణాన్ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ చెబుతున్నట్లుగా ఈ ఘటన వెనుక నిజంగానే టీఎంసీ అంతర్గత వర్గాల ప్రమేయం ఉన్నట్లు తేలితే.. అది పార్టీకి పెద్ద రాజకీయ, సంస్థాగత సవాలుగా మారే అవకాశం ఉంది.
అభిషేక్ బెనర్జీపై స్థానికులు భౌతిక దాడికి దిగడం వెనుక వేరే కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. ఎన్నికల ప్రచారంలో అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రవీంద్ర సంగీతానికి బదులుగా డీజే మ్యూజిక్ ప్లే చేస్తాం. మిమ్మల్ని కాపాడటానికి ఢిల్లీ నుంచి ఏ నాయకుడూ రాడు.. అని ప్రతిపక్షాలను సామాన్య ఓటర్లను బెదిరిస్తున్నట్లు మాట్లాడారు. ఇదే స్థానికులకు ఆగ్రహం తెప్పించి ఉంటుందంటున్నారు. కాగా ఈ దాడి కేవలం అభిషేక్ బెనర్జీకి మాత్రమే పరిమితం కాలేదు. తృణమూల్ నాయకులు ఎక్కడ కనబడ్డా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోంది. హుగ్లీ జిల్లాలోని చండీతాలలో పర్యటిస్తున్న టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మీదకు ఒక్కసారిగా జనం దూసుకొచ్చారు. పరిస్థితి చేజారుతోందని గ్రహించిన భద్రత సిబ్బంది కల్యాణ్ బెనర్జీ తప్పించేందుకు ప్రయత్నించారు. ఇంతలో ఎవరో ఆయన తల మీద కొట్టడంతో కిందపడిపోయారు.
టీఎంసీలో మమతా బెనర్జీ తర్వాత అత్యంత కీలక నాయకుడు అభిషేక్ బెనర్జీ. 2011లో మమతా బెనర్జీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆల్-ఇండియా తృణమూల్ యువ అధ్యక్షుడిగా.. సైబర్ యూనిట్ అనధికారిక హెడ్‌గా రాజకీయ రంగ ప్రవేశం చేసిన అభిషేక్ పార్టీలో అనేక మార్పులకు కారణమయ్యారు. తన నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి.. సీనియర్లను అదుపు చేయడానికి పార్టీలో ఎన్నో మార్పులు చేశారు. అభిషేక్ వచ్చిన తర్వాత ఎందరో సీనియర్లు మమతా బెనర్జీకి దూరయ్యారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి టీఎంసీని వీడటానికి కారణం కూడా ఇదేననిని చెబుతారు. టీఎంసీ అధికారంలో ఉన్న సమయంలో అభిషేక్ బెనర్జీ చుట్టూ జెడ్-ప్లస్ కేటగిరీ భద్రతా వలయం ఉండేది. ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ ప్రభుత్వం ఆ భద్రతను తీసేశారు.. దీంతో కట్టలు తెంచుకున్న జనాగ్రహం కోడిగుడ్ల దాడుల రూపంలో బయటపడిందని చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో దారుణ పరాభవం, పార్టీ నేతలపై దాడులు. నిరసనలు.. వీధి పోరాటాల పిలుపు నేపథ్యంలో కీలక సమావేశానికి మమతా బెనర్జీ తమ పార్టీ శ్రేణులను ఆహ్వానించారు. అయితే 80 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ పరిణామంతో మమత చేసేది లేక సమావేశం వాయిదా వేశారు. సాధారణంగా సంక్షోభ సమయంలో పార్టీ అధినేత పిలిస్తే శాసనసభ్యులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి దూరంగా ఉండటం చర్చకు దారితీసింది. అయితే తమ ఎమ్మేల్యేలు తమ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళనలను పర్యవేక్షిస్తున్నారని టీఎంసీ సమర్ధించుకుంది. పరిస్థితుల దృష్ట్యా సమావేశాన్ని వాయిదా వేయాలని వారే కోరారని, అందుకే పార్టీ అంగీకరించిందని చెప్పారు. మొత్తంగా చూస్తే.. అభిషేక్ బెనర్జీపై దాడి కన్నా ఆ తర్వాత జరిగిన పరిణామాలే ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో చర్చగా మారాయి.