Burning Topic: చక్రం తిప్పుతున్న సోనియా గాంధీ.. కాంగ్రెస్ లోకి శరద్ పవార్ పార్టీ విలీనం?
Burning Topic: దేశ రాజకీయాల్లో ‘అఖండ కాంగ్రెస్’ చర్చ ఊపందుకుంది. శరద్ పవార్‌కు చెందిన ఎన్‌సీపీతో పాటు టీఎంసీ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం కానున్నాయా?
Burning Topic: చక్రం తిప్పుతున్న సోనియా గాంధీ.. కాంగ్రెస్ లోకి శరద్ పవార్ పార్టీ విలీనం?
Burning Topic: శరద్ పవార్‌కు చెందిన ఎన్‌సీపీ త్వరలో కాంగ్రెస్ పార్టీలో కానుందా? దేశ రాజకీయాల్లో దీనిపై ఊహాగాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే శరద్ పవార్ పార్టీ నుంచి అజిత్ పవార్ వర్గంలోకి వలసలు పెరగడంతో ఆ పార్టీ భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మహారాష‌్ట్రలో వరుసగా రాజకీయంగా ఎదురు దెబ్బలు తగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడమే ఉత్తమమని ఆ పార్టీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ వార్తలను ఇప్పటికే సుప్రియా సూలే కొట్టిపారేశారు. మరోవైపు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన వర్గాలన్నీ తిరిగి మాతృసంస్థలోకి రానున్నాయనే చర్చ దేశ రాజకీయాల్లో ఊపందుకుంది.
మహారాష్ట్రతో పాటు దేశ రాజకీయాల్లో పునరేకీకరణకు రంగం సిద్ధమవుతోందా? తాజా రాజకీయ పరిణామాలు ఈ చర్చకు తావిస్తున్నాయి. సీనియర్ నేత శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే దిశగా చర్చలు అత్యంత సానుకూలంగా, తుది దశకు చేరుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జాతీయ రాజకీయాలతో పాటు, మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ విలీన ప్రక్రియ తెరపైకి వచ్చింది.
శరద్ పవార్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయ్యే అవకాశంపై చర్చలు కొనసాగుతున్నాయని, అవి తుది దశకు చేరాయని మహారాష్ట్రకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు విజయ్ వడెట్టివార్ చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొద్దిరోజుల క్రితం మరో కాంగ్రెస్ నాయకుడు నానా పటోలా కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు ఒకే భావజాలం కలిగిన పార్టీలు కాంగ్రెస్‌లో విలీనం కావడానికి సిద్ధమవుతున్నాయని ఆయన వెల్లడించారు.
ఇటీవల శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్ నుంచి విడిపోయిన పార్టీలు తిరిగి విలీనం కావాలని, ఆ ప్రక్రియకు శరద్ పవార్ నాయకత్వం వహించాలని సూచించారు. తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గం వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ సుప్రియా సూలే పూర్తిగా కొట్టిపారేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నుండి తమకు ఎలాంటి విలీన ప్రతిపాదనలు రాలేదని,
తమ వైపు నుండి కూడా అలాంటి ప్రయత్నాలేవీ జరగడం లేదని ఆమె తేల్చి చెప్పారు. అసలు ఈ తరహా ప్రచారం ఎక్కడి నుండి పుట్టుకొచ్చిందో కూడా తనకు అర్థం కావడం లేదన్నారు. శరద్ పవార్‌కు సైతం ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం నుండి ఎటువంటి సమాచారం అందలేదని స్పష్టం చేశారు.సుప్రియా సూలే ఖండించినప్పటికీ, కాంగ్రెస్ హైకమాండ్‌తో అంతర్గత సంప్రదింపులు చర్చనీయాంశంగా మారాయి.
మహారాష్ట్ర రాజకీయాల్లో దిగ్గజ నేత శరద్ పవార్ 1999లో కాంగ్రెస్ నుంచి విడిపోయి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2023లో శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ కూడా అదే విధంగా ఎన్‌సీపీని చీల్చారు. అజిత్ పవార్ తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను తీసుకుని మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరారు. దీంతో ఆ ప్రాంతీయ రాజకీయ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది.
కొద్ది నెలల క్రితం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. తన మరణానికి కొద్ది రోజుల ముందు రెండు ఎన్సీపీ వర్గాల పునరేకీకరణపై చర్చలు జరిగాయి. పార్టీ రెండు వర్గాలు మళ్లీ కలిస్తే ఎన్‌డీఏలోనే కొనసాగాలని అజిత్ పవార్ కోరుకున్నారని కూడా సమాచారం. అయితే అజిత్ పవార్ మరణం తర్వాత ఆయన భార్య సునేత్ర పవార్ క్రియాశీకంగా మారి మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంతో క్రియాశీకంగా మారడంతో ఎన్సీపీ పునరేకీకరణ అటకెక్కింది.
ఎన్‌సీపీ చీలిక, అజిత్ పవార్ వర్గం అధికార కూటమిలో చేరడం వంటి పరిణామాల తర్వాత శరద్ పవార్ తన పార్టీ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయింది. ఇప్పటికే ఆయన పార్టీలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వర్గంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.. ఈ నేపథ్యంలో లౌకికవాద శక్తుల బలోపేతం పేరుతో శరద్ పవార్ ఎన్సీపీ పార్టీకాంగ్రెస్ పార్టీతో తిరిగి విలీనం కావాలని ఆయన కోరుకుంటున్నట్లు చెబుతున్నారు.
కాగా శరద్ పవార్ పార్టీ భవిష్యత్తుపై రెండు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని సమాచారం. ఒక వర్గం ఎన్‌డీఏలో చేరాలని భావిస్తోంది. పార్టీకి పార్లమెంట్‌లో ఉన్న బలం ఆధారంగా ఎన్‌డీఏలో భాగస్వామ్యం లభిస్తుందని ఆ వర్గం వాదిస్తోంది. ప్రతిపక్షంలో ఉండటం వల్ల రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో అభివృద్ధి పనులు, నియోజకవర్గ సమస్యల పరిష్కారం కష్టంగా మారిందని కూడా ఆ వర్గ నాయకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే కొద్ది వారాల క్రితం అఖండ ఖాంగ్రెస్ అనే అంశం తెర మీదకు వచ్చింది. ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి విడిపోయి ప్రాంతీయ పార్టీలను స్థాపించిన నేతలను కలపుకొని పోవాలనే చర్చ మొదలైంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత సంక్షోభం, ఇటీవల జరిగిన వరుస రాజకీయ భేటీల నేపథ్యంలో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.
ఈ ఊహాగానాలకు ఢిల్లీలో జరిగిన రాజకీయ భేటీ ఊతం ఇచ్చాయి. ఇండియా కూటమి సమావేశం కోసం వచ్చిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలు సోనియా, రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం విలీనం అంశంపై తమ నుంచి ఎలాంటి ప్రయత్నాలు లేవని, అలాంటి ప్రతిపాదన వస్తే అది తృణమూల్ కాంగ్రెస్ నుంచే రావాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. తాము మాత్రం ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని స్పష్టం చేసింది.
మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ , శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తిరిగి కాంగ్రెస్‌లో విలీనం కానున్నాయా? అనే చర్చకు బలమైన కారణాలు అయితే ఉన్నాయని చెబుతున్నారు. మమతా బెనర్జీ, శరద్ పవార్ ఇద్దరూ ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లి సొంతగా పార్టీలు పెట్టుకున్న వారే. ఈ రెండు పార్టీల్లోని అంతర్గత సంక్షోభాలను ఎదుర్కొంటున్నారు. సమీప భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు కూడా కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు.
సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అఖండ కాంగ్రెస్ అనేది తెర మీదకు వచ్చింది. కాంగ్రెస్‌లో విలీనం కావడానికి మమతా బెనర్జీ, శరద్ పవార్‌లు తమ మనసులను సిద్ధం చేసుకుంటున్నారు అనేవాదన మొదలు పెట్టింది కూడా కాంగ్రెస్ నాయకులే.. ఈ విలీనం వార్తల్ని టీఎంసీ, కాంగ్రెస్ తోసిపుచ్చాయి. అయినప్పటికీ ప్రచారం మాత్రం ఆగడం లేదు.