Tirupati: నవంబర్ 26న తిరుమలకు సీఎం చంద్రబాబు.. విస్తృత ఏర్పాట్లు

తిరుపతి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 26న తిరుమల పర్యటనకు రానున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడుతో కలిసి అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) తనిఖీలు నిర్వహించారు.

కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 26న గురువారం ఉదయం 10 గంటలకు తిరుపతి వ్యవసాయ విశ్వవిద్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు ముఖ్యమంత్రి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 10.45 గంటలకు తిరుమలలోని గాయత్రి గెస్ట్ హౌస్‌కు చేరుకుని, 11.10 గంటలకు శ్రీవారి దర్శనానికి వెళ్తారు. దర్శనం అనంతరం మధ్యాహ్నం 12.45 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి తిరుపతి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు హెలికాప్టర్‌లో భద్రాద్రి కొత్తగూడెంకు బయలుదేరి వెళ్తారని తెలిపారు.

Tags: