Tirupati: వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా శ్రీధర్ రెడ్డి బాధ్యతలు
Tirupati: వైసీపీ వాలంటరీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన సి. శ్రీధర్ రెడ్డి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన శ్రీధర్ రెడ్డి.
Tirupati: వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా శ్రీధర్ రెడ్డి బాధ్యతలు
తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాలంటరీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన తిరుచానూరుకు చెందిన సి. శ్రీధర్ రెడ్డి ఆదివారం తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసంలో చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి పుష్ఫ గుచ్చంతో సత్కరించారు.
తనకు రాష్ట్ర స్థాయి బాధ్యత లభించడంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అందించిన ప్రోత్సాహం, చేసిన సిఫార్సును జీవితాంతం మరవనని సి. శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిని కూడా శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు శ్రీధర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. జగనన్న స్ఫూర్తితో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి సమర్థవంతంగా పనిచేసే బాధ్యతను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
అనంతరం శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. తనకు అండగా నిలిచిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, చెవిరెడ్డి కుటుంబానికి ఎల్లప్పుడూ విధేయుడిగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి వెంట తిరుచానూరుకు చెందిన పలువురు పార్టీ యువనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.