Srikalahasti: శ్రీకాళహస్తి చైర్మన్ కొట్టే సాయి ఉదారత.. తొలి జీతం విరాళం!

Srikalahasti: సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ముందడుగు వేశారు.

Update: 2026-06-25 02:50 GMT

Srikalahasti: శ్రీకాళహస్తి చైర్మన్ కొట్టే సాయి ఉదారత.. తొలి జీతం విరాళం!

Srikalahasti: శ్రీకాళహస్తిలో నిర్మాణంలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయానికి శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ విరాళం అందించారు. దేవస్థానం చైర్మన్‌గా విధులు చేపట్టిన అనంతరం అందుకున్న తొలి జీతభత్యంలో భాగంగా ఆలయ నిర్మాణానికి సహాయం చేయడం విశేషంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత ఆశయాలకు అనుగుణంగా సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ముందడుగు వేశారు. చైర్మన్‌గా విధులు నిర్వహించిన అనంతరం దేవస్థానం నుంచి అందుకున్న తొలి జీతభత్యాన్ని గంటల వ్యవధిలోనే అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి విరాళంగా అందించారు.

దాదాపు రూ.1.17 లక్షల విలువైన ఈ సహాయం ఆలయ ప్రాంగణంలో బోరు తవ్వకం, మోటార్ ఏర్పాటు కోసం వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా శబరిమల అయ్యప్ప స్వామి వారి తత్వమసి సేవా సమితి సభ్యులు కొట్టే సాయి ప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News