Rainbow Schools: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు విద్యార్థినులు

Rainbow Schools: రేణిగుంట రెయిన్‌బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థినులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక. అభినందించిన కరస్పాండెంట్ అత్తా ఉల్లా ఖాన్.

Update: 2026-08-08 16:11 GMT

Rainbow Schools: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు విద్యార్థినులు

Rainbow Schools: రెయిన్‌బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు అథ్లెటిక్స్‌లో సత్తా చాటారు.రాష్ట్రస్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థినులు ఎంపికై తిరుపతి,చిత్తూరు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించనున్నారు.

ఆగస్టు 11 నుంచి 13వ తేదీ వరకు తిరుపతిలో నిర్వహించనున్న ఏపీ ఇంటర్-డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకు అండర్-16 బాలికల విభాగంలో ఎస్.ఎం.లుఫ్తియా షాట్‌పుట్, సిద్దాల శరణి రిలే,షేక్ సమీరా 80 మీటర్ల హర్డిల్స్ విభాగాల్లో ఎంపికయ్యారు.

విద్యార్థినుల ప్రతిభపై రెయిన్‌బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరెస్పాండంట్ పి అత్తా ఉల్లా ఖాన్ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.అథ్లెటిక్స్ కోచ్ గణపతి అందించిన శిక్షణ, మార్గదర్శకత్వం,ప్రోత్సాహం విద్యార్థినుల విజయానికి దోహదపడిందని పేర్కొన్నారు.

అలాగే విద్యార్థినుల తల్లిదండ్రులకు,క్రీడలను ప్రోత్సహిస్తూ యువ ప్రతిభను ప్రోత్సహిస్తున్న కరస్పాండెంట్ పి.అత్తా ఉల్లా ఖాన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని పాఠశాల యాజమాన్యం ఆకాంక్షించింది.

Tags:    

Similar News