Renigunta: ఒక్కసారిగా మారిన వాతావరణం.. చల్లబడ్డ రేణిగుంట

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో శనివారం మధ్యాహ్నం ఆకస్మిక వర్షం కురిసింది.

Update: 2026-05-02 11:13 GMT

Renigunta: ఒక్కసారిగా మారిన వాతావరణం.. చల్లబడ్డ రేణిగుంట

Renigunta: రేణిగుంట మండల పరిధిలో శనివారం ఉదయం నుంచే సుమారుగా 40 డిగ్రీలతో మండుతున్న ఎండలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉక్కపోతతో అలసిపోయిన ప్రజలకు శనివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈదురు గాలులతో మోస్తరు వర్షం కురవడంతో ప్రాంతం చల్లబడింది.

సుమారు గంటకు పైగా కొనసాగిన వర్షం..

ఈ వర్షంతో ఎండలతో అల్లాడిన ప్రజలకు కొంత ఊరట లభించింది. అయితే భారీ ఈదురు గాలుల కారణంగా రహదారులపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పుత్తూరు,కడప,శ్రీకాళహస్తి బైపాస్ రోడ్లలో కొన్ని ప్రాంతాల్లో వాహనాలు స్వల్పంగా నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు కొంత అంతరాయం ఏర్పడింది. మొత్తానికి ఆకస్మిక వర్షం వల్ల ప్రజలకు కొంత ఉపశమనం కలిగించగా,మరికొంత అసౌకర్యాన్ని కూడా కలిగించింది.

Tags:    

Similar News