Puttur: పుత్తూరులో సరికొత్త ఎస్డీపీఓ కార్యాలయాన్ని ప్రారంభించిన డీజీపీ

Puttur: నూతనంగా నిర్మించిన సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయాన్ని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎమ్మెల్యేలు గాలి భాను ప్రకాష్, ఆదిమూలంతో కలిసి ప్రారంభించారు.

Update: 2026-06-26 11:49 GMT

Puttur: పుత్తూరులో సరికొత్త ఎస్డీపీఓ కార్యాలయాన్ని ప్రారంభించిన డీజీపీ

పుత్తూరు: పుత్తూరులో నూతనంగా నిర్మించిన సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయాన్ని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హరీష్ కుమార్ గుప్తా శుక్రవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ వి. సుబ్బారాయుడు,నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం,పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవం అనంతరం నూతన కార్యాలయాన్ని పరిశీలించిన డీజీపీ,పోలీసు సిబ్బందితో మాట్లాడి ప్రజలకు మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలని సూచించారు.

ఆధునిక వసతులతో ఏర్పాటు చేసిన ఈ సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం ద్వారా పుత్తూరు సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలకు పోలీసు సేవలు మరింత వేగవంతంగా అందనున్నాయని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:    

Similar News