Tirupati: తిరుపతిలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జెండావిష్కరణ!

Tirupati: తిరుపతి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణ. చంద్రబాబు ప్రభుత్వంపై డీఎస్సీ, నిరుద్యోగ భృతి విషయంలో విమర్శలు.

Update: 2026-08-15 06:56 GMT

Tirupati: తిరుపతిలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జెండావిష్కరణ!

Tirupati: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు.80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని,మరింత ముందుకు దూసుకుపోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

అనంతరం రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, నిరుద్యోగుల సమస్యలపై ఆయన మాట్లాడారు.గత ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించేందుకు అనేక మంది ఉపాధ్యాయులు కష్టపడ్డారని, ప్రస్తుతం వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పెద్దిరెడ్డి విమర్శించారు. డీఎస్సీ విషయంలో అనేక మంది అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.

నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి యువతను మోసం చేశారని ఆయన విమర్శించారు. నిరుద్యోగులు తమ హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలని, నిరుద్యోగ భృతి కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగేలా తమ పార్టీ తరఫున ఉద్యమం చేపట్టామని పేర్కొన్నారు.

Tags:    

Similar News