Sullurupeta: సూళ్ళూరుపేట ఘనంగా 'కాసం ఫ్యాషన్స్' మాల్ ప్రారంభం

Sullurupeta: సూళ్ళూరుపేటలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, నటి అనసూయ చేతుల మీదుగా కాసం ఫ్యాషన్స్ ప్రారంభం. 200 మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమన్న ఎమ్మెల్యే.

Update: 2026-07-10 09:50 GMT

Sullurupeta: సూళ్ళూరుపేట ఘనంగా 'కాసం ఫ్యాషన్స్' మాల్ ప్రారంభం

సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'కాసం ఫ్యాషన్స్' మాల్‌ను సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మరియు ప్రముఖ సినీ నటి అనసూయ భరద్వాజ్ కలిసి ప్రారంభించారు. మాల్ ప్రాంగణంలో రిబ్బన్ కట్ చేసి, దీపప్రజ్వలన చేసిన అనంతరం ఎమ్మెల్యే మాల్‌లోని వివిధ విభాగాలను కలియదిరిగారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న ప్రతి ఉద్యోగిని ఎంతో ఆప్యాయంగా పలకరించారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ, ఈ షాపింగ్ మాల్ ఏర్పాటు ద్వారా స్థానికంగా దాదాపు 200 మందికి ఉపాధి లభించడం ఎంతో సంతోషదాయకమని పేర్కొన్నారు. ముఖ్యంగా, ఇందులో 180 మంది మహిళలకు ఉపాధి కల్పించడం అభినందనీయమని కొనియాడారు. "నా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఉపాధి పొందాలన్నదే నా ఆశయం.

స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా ఇప్పటికే ఎంతో మందికి ఉపాధి మార్గాలను సుగమం చేశాము. మీకు ఎలాంటి సమస్య ఉన్నా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్‌లో నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను, నేరుగా వచ్చి పరిష్కరించుకోండి. మీకు ఉపాధి లేదు అనే భావన వద్దు, మన సూళ్ళూరుపేట అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి" అని ఆమె పిలుపునిచ్చారు. 'కాసం ఫ్యాషన్స్' సంస్థకు ఇది 29వ బ్రాంచ్ కావడం విశేషమని ఆమె పేర్కొన్నారు.

​అనంతరం సినీ నటి అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ, తనకు సూళ్ళూరుపేటతో ఎంతో కాలంగా విడదీయలేని అనుబంధం ఉందని చెప్పారు. ప్రతి ఫ్లెమింగో ఫెస్టివల్‌కు తాను ఇక్కడికి వస్తుంటానని, అప్పటితో పోలిస్తే నేడు సూళ్ళూరుపేట రోడ్లు, మౌలిక వసతులు ఎంతో మెరుగుపడ్డాయని తెలిపారు.

నియోజకవర్గం అభివృద్ధి పథంలో సాగుతుండటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని, ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ గారి కృషి అభినందనీయమని అన్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నియోజకవర్గం ఇలాంటి అభివృద్ధిని సాధించడం ఆనందకరమని పేర్కొన్నారు. ఈ మాల్‌లో ప్రజలకు అవసరమైన అన్ని రకాల వస్త్రాలు చాలా తక్కువ ధరలకే లభిస్తున్నాయని ఆమె తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు.

Tags:    

Similar News