Srikalahasti: శ్రీకాళహస్తి గెస్ట్ హౌస్ రెసిడెన్సీలో పోలీసుల రైడ్స్
Srikalahasti: శ్రీకాళహస్తిలోని ‘లార్జ్ గెస్ట్ హౌస్ రెసిడెన్సీ’లో డీఎస్పీ నర్సింహమూర్తి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Srikalahasti: శ్రీకాళహస్తి గెస్ట్ హౌస్ రెసిడెన్సీలో పోలీసుల రైడ్స్
Srikalahasti: శ్రీకాళహస్తి లార్జ్ గెస్ట్ హౌస్ రెసిడెన్సీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన డీఎస్పీ నర్సింహమూర్తి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని లార్జ్ గెస్ట్ హౌస్ రెసిడెన్సీలో డీఎస్పీ నర్సింహమూర్తి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గెస్ట్ హౌస్‌లో బస చేస్తున్న వారి వివరాలు, రిజిస్టర్ నమోదు, గుర్తింపు పత్రాల ధృవీకరణతో పాటు భద్రతా ప్రమాణాలను పరిశీలించారు.
గెస్ట్ హౌస్ నిర్వాహకులు తప్పనిసరిగా అతిథుల పూర్తి వివరాలను నమోదు చేయాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని డీఎస్పీ సూచించారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
తనిఖీల్లో స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.