Srikalahasti: శ్రీకాళహస్తిలో దెబ్బతిన్న వంతెన పరిశీలన
Srikalahasti: కాంగ్రెస్ నాయకుల క్షేత్రస్థాయి పరిశీలన. మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు.. భక్తుల రక్షణ కోసం తక్షణ మరమ్మతులకు డిమాండ్.
Srikalahasti: శ్రీకాళహస్తిలో దెబ్బతిన్న వంతెన పరిశీలన
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణం 29వ వార్డులోని నక్కల కాలువ వంతెన దెబ్బతిన్న పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. గత సంవత్సరం నిర్మించిన మురుగు కాలువ కారణంగా వర్షాకాలంలో మట్టి కోతకు గురై వంతెన రిటర్నింగ్ వాల్ పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిపారు. నవంబర్ నెలలోనే వంతెన రిటర్నింగ్ వాల్ కూలిపోగా, ప్రస్తుతం వంతెన కూడా ప్రమాదకర స్థితికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సమస్యపై పలుమార్లు సంబంధిత ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు చేపట్టలేదని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. శ్రీకాళహస్తి పురపాలక శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా, త్వరితగతిన నివారణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ మార్గం ద్వారా ప్రతిరోజూ వేలాది మంది భక్తులు శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనానికి వెళ్తుండటంతో ప్రజల భద్రత దృష్ట్యా వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
వంతెనకు మరింత నష్టం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సురేంద్ర రెడ్డి, రాహుల్ రాయల్, ఆంటోనీ, మురళి రెడ్డి, జోసెఫ్, కృష్ణ సాయి, నాగరాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమస్యపై స్పందించిన తలపా దామోదరం రెడ్డి సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.