Konda Surekha: కొండా సురేఖపై వేటు..అధిష్టానం సంచలన నిర్ణయం..?

Konda Surekha: సొంత పార్టీ, సీఎంపై వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖపై వేటు వేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Update: 2026-09-03 02:31 GMT

Konda Surekha: కొండా సురేఖపై వేటు..అధిష్టానం సంచలన నిర్ణయం..?

Congress High Command: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ, పార్టీ వర్గాల్లోనూ ఇప్పుడు ఒకే ఒక్క అంశం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అదే మంత్రి కొండా సురేఖపై వేటు! సొంత పార్టీ నాయకత్వంపైనా, ప్రభుత్వంపైనా ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏఐసీసీ అధిష్ఠానానికి తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో సురేఖ మంత్రిపదవి ఊడటం దాదాపు ఖాయమైపోయిందనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.

తమపై వచ్చిన ఆరోపణలు, అధిష్ఠానం వద్ద తలెత్తిన అసంతృప్తిపై వివరణ ఇచ్చేందుకు కొండా సురేఖ హుటాహుటిన ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అయితే అక్కడ ఆమెకు ఊహించని షాక్ తగిలింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆమెకు అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆమెతో ఎంతో అసంతృప్తిగా, కేవలం నామమాత్రంగా మాట్లాడి పంపించేశారని సమచారం.

ఏఐసీసీ పెద్దల నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో తీవ్ర నిరాశతో తిరుగుపయనమైన సురేఖ, అనంతరం నేరుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లక్ష్యంగా ఆరోపణలు గుప్పించడం అధిష్ఠానానికి మండిప్రాజెంత పనిచేసింది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌లతో కలిసి ఢిల్లీలో ఖర్గే, వేణుగోపాల్‌లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

సురేఖ చేసిన వ్యాఖ్యలను కేవలం అంతర్గత ప్రజాస్వామ్యంగా చూడవద్దని, ఇది తీవ్రమైన క్రమశిక్షణా ఉల్లంఘన కిందకే వస్తుందని సీఎం రేవంత్ అధిష్ఠానానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అనుమతించాలని ఆయన కోరినట్లు సమాచారం. నామినేటెడ్ పదవుల భర్తీ, కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన ఆశావాహుల జాబితాను కూడా అధిష్ఠానం ముందుంచినట్లు కథనాలు వస్తున్నాయి.

ఈ నెల 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు పూర్తయిన వెంటనే మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని అధిష్ఠానం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

అదే సమయంలో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకడం ఖాయంగా కనిపిస్తోంది. పరిస్థితులు మరీ విషమిస్తే అసెంబ్లీ సమావేశాల కంటే ముందే, ఏ క్షణంలోనైనా ఆమెపై బర్తరఫ్ వేటు పడే అవకాశాలను సైతం కొట్టిపారేయలేమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News