Lady Constable: బయటపడ్డ మహిళ కానిస్టేబుల్‌తో ఎస్సై రాసలీలలు..చివరకు ఏమైందంటే.?
Lady Constable: పెళ్లి పేరుతో తోటి మహిళా కానిస్టేబుల్‌ను మోసం చేసిన ఎస్సై సురేష్ కుమార్ ఉదంతం భాగ్యనగరంలో సంచలనం రేపుతోంది.
Lady Constable: బయటపడ్డ మహిళ కానిస్టేబుల్‌తో ఎస్సై రాసలీలలు..చివరకు ఏమైందంటే.?
Harassment సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు విభాగం అంటే ప్రజల్లో ఎంతో గౌరవం ఉంటుంది. కానీ, కొందరు వ్యక్తులు ఆ ఖాకీ దుస్తుల వెనుక ఉన్న క్రూరత్వాన్ని బయటపెడుతూ మొత్తం విభాగానికే తలవంపులు తెస్తున్నారు. అభాగ్యులకు అండగా ఉండాల్సిన వారే, తోటి ఉద్యోగులను కూడా వదలకుండా వంచనకు పాల్పడటం గమనార్హం. తాజాగా భాగ్యనగరంలోని కూకట్‌పల్లిలో వెలుగులోకి వచ్చిన ఓ దారుణ ఘటన ఇప్పుడు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
పెళ్లి పేరుతో మాయ మాటలు
సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పని చేస్తున్న 2018 బ్యాచ్‌కు చెందిన సురేష్ కుమార్, కూకట్‌పల్లి పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ లేడీ కానిస్టేబుల్‌కు మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. తాను నిన్ను పెళ్లి చేసుకుంటానని, నీతో జీవితాన్ని పంచుకుంటానని ఆ మహిళా కానిస్టేబుల్‌ను సురేష్ నమ్మించాడు. అతని మాటలను నిజమని నమ్మిన ఆమె, అతనికి మరింత దగ్గరైంది. ఇద్దరూ తరచూ కలుసుకునేవారు.
అసలు రంగు బయటపడిందిలా..
కొంతకాలం గడిచిన తర్వాత, పెళ్లి చేసుకోవాలని సదరు మహిళా కానిస్టేబుల్ ఒత్తిడి చేయడంతో ఎస్సై సురేష్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. పెళ్లి ఊసెత్తితే చాలు తప్పించుకోవడం మొదలుపెట్టాడు. ఇటీవలి కాలంలో వీరి మధ్య ఈ విషయంలో గొడవలు ముదిరాయి. సురేష్ తనను కేవలం శారీరకంగా వాడుకుని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని గ్రహించిన బాధితురాలు అతడిని గట్టిగా నిలదీసింది. దానికి ఆ కామాంధుడు ఏమాత్రం బెదరకుండా, పెళ్లి చేసుకోవడం అస్సలు కుదరదని తెగేసి చెప్పాడు.
ఖైదీగా మారిన ఖాకీ అధికారి..
తాను దారుణంగా మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తోటి ఉద్యోగిపైనే ఫిర్యాదు రావడంతో ఉన్నతాధికారులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, సురేష్ ఫోన్ స్విచాఫ్ చేసి పరారయ్యే ప్రయత్నం చేశాడు. అయితే, క్రమశిక్షణారాహిత్యం ,మహిళా కానిస్టేబుల్‌ను వేధించిన ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఎస్సై సురేష్‌ను వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
చట్టాన్ని గౌరవించి, మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత గల అధికారి ఇలాంటి నీచానికి ఒడిగట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రక్షకుడే భక్షకుడైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన తెలంగాణ పోలీసు శాఖలో హాట్ టాపిక్‌గా మారింది.