Pawan kalyan: అదే నా రస్తా.. తెలంగాణలో రాజకీయంపై పవన్ ఫుల్ క్లారిటీ. వైరల్ అవుతోన్న కొత్త ట్వీట్
Pawan kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్టు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Pawan kalyan: అదే నా రస్తా.. తెలంగాణలో రాజకీయంపై పవన్ ఫుల్ క్లారిటీ. వైరల్ అవుతోన్న కొత్త ట్వీట్
Pawan kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్టు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో జనసేన పార్టీ భవిష్యత్తుపై స్పష్టత ఇస్తూనే, తన రాజకీయ ప్రయాణం, తెలంగాణ ఉద్యమంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఆయన భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు.
తెలంగాణలో జనసేన కొనసాగుతుందని స్పష్టం
ఇటీవల "నవనిర్మాణ సభ"కు అనుమతి నిరాకరణ అంశం రాజకీయంగా చర్చకు దారితీసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలు కొనసాగుతాయని, రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. ఈ ప్రకటన తర్వాత ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు మరింత ఆసక్తి రేకెత్తించింది. తెలంగాణ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ, పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి సందేహాలు అవసరం లేదనే సంకేతం ఇచ్చారు.
శేషేంద్ర కవితతో పోరాట స్ఫూర్తి సందేశం
పవన్ కళ్యాణ్ తన పోస్టులో మహాకవి శేషేంద్ర రచించిన "ఆధునిక మహాభారతం"లోని కొన్ని పంక్తులను ప్రస్తావించారు. పోరాటం, సవాళ్లు, అపజయాలు, సంకెళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగే మార్గం గురించిన ఆ కవిత తన ఆలోచనలకు ప్రతిబింబంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కవిత ద్వారా రాజకీయ ఒత్తిడులు, విమర్శలు, అడ్డంకులు వచ్చినా తన లక్ష్యాల నుంచి వెనక్కి తగ్గబోనన్న సందేశాన్ని పరోక్షంగా ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ కవితా భాగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలంగాణ ఉద్యమంతో తన అనుబంధాన్ని గుర్తు చేసిన జనసేనాని
ఇదిలా ఉంటే అంతకు ముందు పవన్ కళ్యాణ్.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి తన మద్దతు ఇటీవల ప్రారంభమైనది కాదని వివరించారు. 2009లో తాను ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం విభాగానికి నాయకత్వం వహిస్తున్న సమయంలో తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి విద్యార్థి నాయకులు, ఉద్యమకారులతో కలిసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మద్దతుగా నిలిచినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కోసం సాగిన ఉద్యమంలో సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమాన అవకాశాల అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తాను అప్పుడే పిలుపునిచ్చానని వెల్లడించారు.
రాజకీయ లాభం కోసం కాదు..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తన మద్దతు రాజకీయ ప్రయోజనాల కోసం కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజల అభిలాషలు, వారి గుర్తింపు, గౌరవం పట్ల తనకున్న నమ్మకంతోనే ఆ వైఖరి తీసుకున్నానని చెప్పారు.
తెలంగాణ ప్రజల పట్ల తనకు ఉన్న గౌరవం, నిబద్ధత ఇప్పటికీ అలాగే కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర హక్కుల కోసం ప్రజలు వ్యక్తం చేసిన ఆకాంక్షలకు అండగా నిలవడం తన రాజకీయ సిద్ధాంతంలో భాగమని వివరించారు. తెలంగాణలో జనసేన పార్టీ భవిష్యత్తుపై జరుగుతున్న చర్చల మధ్య పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. పార్టీ విస్తరణ, తెలంగాణ రాజకీయాల్లో జనసేన పాత్రపై ఈ పోస్టు కొత్త చర్చకు తెరతీసింది.
ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో
— Pawan Kalyan (@PawanKalyan) June 3, 2026
ప్రాణాల్ని ఆటబంతుల్లా
విసిరేస్తుందో
గెలుస్తుందో ఓడుతుందో
కానీ ముందుకు పోతుందో
అదే నా రస్తా
ఏ రస్తాలో సంకెళ్లు కూడా
సవాల్ చేస్తాయో
ఏ రస్తాలో అపజయం కూడా
అగ్నిజ్వాలై మండుతుందో
ఏ రాస్తాలో మరణం
మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో
అదే నా రాస్తా...… pic.twitter.com/VTwKD00zW2