Redmi 17 5G: బడ్జెట్ ధరలో రెడ్‌మీ 17 ఫోన్లు.. ఏకంగా 7500 ఎంఏహెచ్ బ్యాటరీతో మార్కెట్‌లోకి.. ధరెంతంటే?

Redmi 17 5G: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు షావోమి సంస్థ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. అత్యంత చౌకైన ధరలో ఏకంగా 7500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, ఆకర్షణీయమైన ఫీచర్లతో రెడ్‌మీ 17 ఫైవ్‌జీ, ఫోర్‌జీ మోడళ్లను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది.

Update: 2026-08-10 13:48 GMT

Redmi 17 5G: బడ్జెట్ ధరలో రెడ్‌మీ 17 ఫోన్లు.. ఏకంగా 7500 ఎంఏహెచ్ బ్యాటరీతో మార్కెట్‌లోకి.. ధరెంతంటే?

Redmi 17 5G: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు షావోమి సంస్థ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. అత్యంత చౌకైన ధరలో ఏకంగా 7500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, ఆకర్షణీయమైన ఫీచర్లతో రెడ్‌మీ 17 ఫైవ్‌జీ, ఫోర్‌జీ మోడళ్లను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ల ధర, ఫీచర్లు, ఇతర పూర్తి వివరాలు ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

స్మార్ట్‌ఫోన్ రంగంలో నిత్యం వినూత్న మోడళ్లను పరిచయం చేసే షావోమి సంస్థ, తన పాపులర్ రెడ్‌మీ సిరీస్‌లో సరికొత్త రెడ్‌మీ 17 5జీ, 4జీ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లలో 6.9 అంగుళాల భారీ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే అమర్చారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఈ స్క్రీన్ వల్ల గేమింగ్, వీడియా స్ట్రీమింగ్ ఎంతో స్మూత్‌గా సాగుతాయి. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ రక్షణ కల్పించారు. ఐపీ64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉండటం వల్ల నీటి చినుకులు పడినా ఫోన్‌కు ఏమీ కాదు. వెనుక వైపు నోటిఫికేషన్లు, ఛార్జింగ్ సమయాల్లో మెరిసేలా డైనమిక్ ఆర్‌జీబీ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం ఈ ఫోన్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

పవర్ ఫుల్ ప్రాసెసర్ - స్టోరేజ్‌లోనూ అదుర్స్..

ప్రాసెసర్ పనితీరు విషయానికి వస్తే 5జీ, 4జీ వేరియంట్ల మధ్య వ్యత్యాసం ఉంది. రెడ్‌మీ 17 5జీ మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 ప్రాసెసర్ వాడగా, 4జీ మోడల్‌లో మీడియాటెక్ హెలియో జీ91 అల్ట్రా చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3 సాఫ్ట్‌వేర్‌పై ఈ ఫోన్లు పనిచేస్తాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు 4జీబీ, 6జీబీర్యామ్ వేరియంట్లలో లభ్యమవుతాయి. వీటిలో 128జీబీ, 256జీబీ అంతర్గత స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను ఏకంగా 2టీబీ వరకు పెంచుకునే సదుపాయం కల్పించడం విశేషం.

50 మెగాపిక్సెల్ కెమెరా - క్లారిటీ ఫోటోలు..

ఫోటోలను ఇష్టపడే వారి కోసం ఈ స్మార్ట్‌ఫోన్లలో నాణ్యమైన కెమెరా సెటప్ అందించారు. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు డ్యూయల్ వ్యూ రికార్డింగ్ సపోర్ట్ ఇచ్చారు. ముందు వైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు 300 శాతం వాల్యూమ్ బూస్ట్ ఫీచర్‌తో వస్తుండటంతో పాటలు వినేటప్పుడు, సినిమాలు చూసేటప్పుడు మంచి సౌండ్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సదుపాయాలు ఉన్నాయి.

7500 ఎంఏహెచ్ బ్యాటరీ - తిరుగులేని చార్జింగ్..

ఈ స్మార్ట్‌ఫోన్ల ప్లస్ పాయింట్ వీటి బ్యాటరీ కెపాసిటీ. సాధారణ ఫోన్లకు భిన్నంగా ఇందులో 7500 ఎంఏహెచ్ కొండంత బ్యాటరీని అందించారు. దీనికి తోడు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కేవలం 96 నిమిషాల్లో ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. అంతేకాకుండా 22.5 వాట్స్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల ఈ ఫోన్ నుంచి ఇతర పరికరాలను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ధర విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్‌లో రెడ్‌మీ 17 ఫోర్‌జీ వేరియంట్ ధర సుమారు 17,000 రూపాయల నుంచి, ఫైవ్‌జీ వేరియంట్ ధర సుమారు 23,700 రూపాయల నుంచి ప్రారంభమవుతోంది.

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ లైఫ్, భారీ డిస్‌ప్లే కోరుకునే వినియోగదారులకు రెడ్‌మీ 17 సిరీస్ ఫోన్లు అద్భుతమైన ఎంపికగా నిలుస్తాయి. గ్లోబల్ లాంచ్ ముగియడంతో త్వరలోనే భారత మార్కెట్లోకి ఇవి అడుగుపెట్టే అవకాశం ఉంది. భారత మార్కెట్లో వీటి ధర మరింత అందుబాటులో ఉంటే బడ్జెట్ విభాగంలో సంచలనం సృష్టించడం ఖాయం.

Tags:    

Similar News