Nokia: గెట్ రెడీ.. నోకియా మళ్లీ వచ్చేస్తోంది!

Nokia: హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ భారత్‌లో నాలుగు సరికొత్త నోకియా 4G ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసింది.

Update: 2026-07-06 02:23 GMT

Nokia: గెట్ రెడీ.. నోకియా మళ్లీ వచ్చేస్తోంది!

Nokia Phones: ఒకప్పుడు మొబైల్ ప్రపంచాన్ని ఏలిన నోకియా.. కాలానికి అనుగుణంగా మారుతూ సరికొత్త అవతారమెత్తింది. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లకే పరిమితం అనుకునే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను, ఇప్పుడు మనం రోజువారీగా వాడే ఫీచర్ ఫోన్లలోకి తీసుకొచ్చి నోకియా సంచలనం సృష్టించింది.

ప్రముఖ నోకియా బ్రాండ్‌పై మొబైళ్లను తయారుచేసే ఫిన్లాండ్‌కు చెందిన హెచ్‌ఎండీ ) గ్లోబల్ సంస్థ, ఒకేసారి నాలుగు సరికొత్త 4G ఫీచర్ ఫోన్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సిరీస్‌లో సరికొత్తగా నోకియా 200 4G, నోకియా 210 4G మోడళ్లను తీసుకురావడంతో పాటు, గతంలో సూపర్ హిట్ అయిన నోకియా 215 4G, నోకియా 235 4G ఫోన్ల సెకండ్ ఎడిషన్ (రెండో వెర్షన్)లను కూడా రీ-లాంచ్ చేసింది.

సాధారణ బటన్ ఫోన్లలా కాకుండా, ఈ సరికొత్త సిరీస్ ఫోన్లలో యూజర్లను కట్టిపడేసేలా ఎన్నో అధునాతన ఆప్షన్లను జోడించారు. ఈ ఫోన్లలో ప్రత్యేకంగా ఒక ఏఐ బటన్‌ను అందించారు. దీని ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఈ ఫోన్లలోని అసలైన హైలైట్ Sikey AI అసిస్టెంట్. కేవలం మీ వాయిస్ కమాండ్స్‌తోనే మొబైల్ ఫ్లాష్‌లైట్ ఆన్ చేయడం, కెమెరా ఓపెన్ చేయడం, రిమైండర్‌లు సెట్ చేసుకోవడం, అలాగే నేరుగా ఫోన్ కాల్స్ చేయడం వంటి పనులను క్షణాల్లో పూర్తి చేయవచ్చు.

ఈ ఫోన్లలో ప్రీ-ఇన్‌స్టాల్‌గా వచ్చే ఎక్స్‌ప్రెస్ చాట్ యాప్ సాయంతో వినియోగదారులు చాలా సులువుగా వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఫోన్ ఇంటర్నల్ స్టోరేజీతో అస్సలు సంబంధం లేకుండా, నేరుగా క్లౌడ్ ద్వారా వివిధ రకాల ఫీచర్లను, అప్లికేషన్లను ఉపయోగించుకునే అద్భుతమైన ఆప్షన్‌ను ఇందులో జోడించారు.

స్మార్ట్‌ఫోన్ల వాడకం రాని వారికి, లేదా సెకండరీ మొబైల్‌గా చిన్న ఫోన్ వాడాలనుకునే వారికి ఈ నోకియా 4G ఏఐ ఫోన్లు ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానున్నాయి. తక్కువ బడ్జెట్‌లోనే ఏఐ హంగులను ఆస్వాదించాలనుకునే భారతీయ మొబైల్ ప్రియులకు హెచ్‌ఎండీ గ్లోబల్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిందనే చెప్పాలి.

Tags:    

Similar News