iQOO 16: ప్రత్యేక గ్రాఫిక్స్ చిప్, డ్యూయల్ స్పీకర్.. ఐక్యూ నుంచి కళ్లు చెదిరే కొత్త ఫోన్ వచ్చేస్తోంది
iQOO 16: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ త్వరలోనే మార్కెట్లోకి కొత్త ఫోన్‌నుతీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
iQOO 16: ప్రత్యేక గ్రాఫిక్స్ చిప్, డ్యూయల్ స్పీకర్.. ఐక్యూ నుంచి కళ్లు చెదిరే కొత్త ఫోన్ వచ్చేస్తోంది
iQOO 16: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ త్వరలోనే మార్కెట్లోకి కొత్త ఫోన్‌నుతీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐక్యూ16 పేరుతో లాంచ్ చేయనున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో కళ్లు చెదిరే ఫీచర్లను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో
టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, iQOO 16 ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఇందులో క్వాల్కమ్ ఇంకా ప్రకటించని స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్6 ప్రో ప్రాసెసర్‌ను అందించే అవకాశం ఉంది. ఈ కొత్త చిప్‌లో 2+3+3 Oryon CPU ఆర్కిటెక్చర్, 16MB L2 క్యాష్ ఉండొచ్చని సమాచారం. అలాగే గ్రాఫిక్స్ పనితీరును మరింత మెరుగుపరచేందుకు Adreno 850 GPU ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. LPDDR6, LPDDR5X ర్యామ్‌లకు కూడా ఇది మద్దతు ఇవ్వనుందని లీకులు చెబుతున్నాయి.
గేమింగ్ కోసం ప్రత్యేక గ్రాఫిక్స్ చిప్
iQOO 16లో ప్రత్యేకంగా డెడికేటెడ్ గ్రాఫిక్స్ చిప్ కూడా ఉండే అవకాశం ఉంది. గతంలో వచ్చిన iQOO 15లో Q3 సూపర్ కంప్యూటింగ్ చిప్‌ను కంపెనీ అందించింది. ఈ చిప్ ద్వారా గేమ్‌లలో ఫ్రేమ్ ఇంటర్‌పొలేషన్, అప్‌స్కేలింగ్ వంటి టెక్నాలజీల సహాయంతో 2K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ వరకు గేమింగ్ అనుభవాన్ని అందించే అవకాశం ఉంది. దీంతో మొబైల్ గేమింగ్ ఇష్టపడే వారికి ఈ ఫోన్ మంచి ఎంపికగా మారే అవకాశముంది.
8,500mAh భారీ బ్యాటరీ.. శక్తివంతమైన ఆడియో
ఈ ఫోన్‌లో 8,500mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ఉండనున్నట్లు టిప్‌స్టర్ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా ఫ్లాగ్‌షిప్ ఫోన్లతో పోలిస్తే ఇది చాలా పెద్ద బ్యాటరీగా చెప్పవచ్చు. అలాగే 1115 సిరీస్ సమానమైన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో సినిమాలు చూడటం, పాటలు వినడం, గేమ్స్ ఆడేటప్పుడు మెరుగైన సౌండ్ అనుభూతి పొందొచ్చు. ఇందులో అదనంగా 0916 సిరీస్ X-యాక్సిస్ లీనియర్ మోటార్ ఉండటంతో వైబ్రేషన్, హ్యాప్టిక్ ఫీడ్‌బ్యాక్ కూడా మరింత సహజంగా ఉండే అవకాశముంది.
అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు మరిన్ని ఫీచర్లు
సెక్యూరిటీ కోసం iQOO 16లో 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇవ్వనున్నట్లు సమాచారం. సాధారణ ఆప్టికల్ సెన్సార్‌తో పోలిస్తే ఇది వేగంగా, మరింత ఖచ్చితంగా పని చేసే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్‌కు IP68 + IP69 రేటింగ్ లభించే అవకాశముంది. దీంతో దుమ్ము, నీటి నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది. ఫాస్ట్ డేటా ట్రాన్స్‌ఫర్ కోసం USB 3.2 సపోర్ట్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
లాంచ్ ఎప్పుడు..? భారత్‌కు ఎప్పుడొస్తుంది.?
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం iQOO 16ను ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో చైనాలో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే భారత్‌లో ఈ ఫోన్ లాంచ్‌పై ఇంకా స్పష్టత లేదు. ఇటీవల వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం మెమరీ చిప్‌ల ధరలు పెరగడంతో ఈ ఫోన్ ధర ఎక్కువయ్యే అవకాశం ఉందని, అందుకే భారత మార్కెట్లో విడుదలను కంపెనీ వాయిదా వేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై iQOO నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.