6500mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. ఇన్ఫినిక్స్ నుంచి కొత్త ఫోన్.. ధరెంతో తెలుసా?
Infinix Note 60 Pro: ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు నిల్వ సామర్థ్యం ఉంది. వర్చువల్ ర్యామ్ ద్వారా దీనిని మరో 8జీబీ పెంచుకోవచ్చు.
Infinix Note 60 Pro
Infinix Note 60 Pro: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఇన్ఫినిక్స్ అదిరిపోయే వార్తను అందించింది. అద్భుతమైన ఫీచర్లతో కూడిన 'ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో'ను ఏప్రిల్ 13న భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. భారీ బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్, పవర్ ఫుల్ ప్రాసెసర్‌తో రానున్న ఈ ఫోన్, మధ్యతరగతి వినియోగదారులను ఆకట్టుకునేలా తక్కువ ధరకే లభించనుంది. దీని ప్రత్యేకతలపై ఓ లుక్కేద్దాం.
ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో మూడు ఆకర్షణీయమైన రంగులలో (సోలార్ ఆరెంజ్, డీప్ ఓషన్ బ్లూ, మోకా బ్రౌన్) లభించనుంది. ఇందులో 6.78 అంగుళాల 1.5కె అమోలెడ్ తెరను అమర్చారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ వరకు కాంతిని ఇచ్చే సామర్థ్యం కలిగి ఉంటుంది. స్క్రీన్ రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 7i సాంకేతికతను వాడారు. ఇది ఫోన్‌కు మరింత పటిష్టతను ఇస్తుంది.
వేగవంతమైన పనితీరు, అత్యాధునిక సాంకేతికత..
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు నిల్వ సామర్థ్యం ఉంది. వర్చువల్ ర్యామ్ ద్వారా దీనిని మరో 8జీబీ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత సరికొత్త ఎక్స్ ఓఎస్ 16 సాఫ్ట్‌వేర్‌పై ఇది నడుస్తుంది. గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా '3డి ఐస్‌కోర్ వేపర్ ఛాంబర్' కూలింగ్ వ్యవస్థను ఇందులో ప్రవేశపెట్టారు.
అద్భుతమైన కెమెరా, ఫోటోగ్రఫీ ఫీచర్లు..
ఫోటోల కోసం వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా (OIS మద్దతుతో) 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌ను ఇచ్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది 4కె వీడియో రికార్డింగ్, సూపర్ నైట్ మోడ్, వ్లాగ్ మోడ్ వంటి అత్యాధునిక ఫీచర్లతో వస్తోంది. చీకటిలో కూడా స్పష్టమైన ఫోటోలు తీసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
కొండంత బ్యాటరీ.. మెరుపు వేగంతో ఛార్జింగ్..
ఈ ఫోన్ అతిపెద్ద బలం దీని బ్యాటరీ. ఇందులో 6500mAh భారీ బ్యాటరీని అమర్చారు. దీనిని వేగంగా ఛార్జ్ చేయడానికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. అంతేకాకుండా 30W వైర్‌లెస్ ఛార్జింగ్, ఇతర ఫోన్లను ఛార్జ్ చేసుకునే రివర్స్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉండటం విశేషం.
ముందస్తు బుకింగ్ పై భారీ ఆఫర్లు..
వినియోగదారులు ఈ ఫోన్‌ను ముందే బుక్ చేసుకుంటే సుమారు 7,999 రూపాయల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో 3,000 రూపాయల బ్యాంక్ రాయితీ, నో-కాస్ట్ ఈఎంఐ, ఉచిత స్పీకర్, పొడిగించిన వారంటీ వంటి ఆఫర్లు ఉన్నాయి. ఐపీ64 రేటింగ్‌తో ధూళి, నీటి చినుకుల నుంచి రక్షణ పొందేలా దీనిని రూపొందించారు.