Flipkart: ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్.. కళ్లు చెదిరే ఆఫర్లు.. మే నుంచే షురూ..!
Flipkart: మే 9 నుండి ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సమ్మర్ సేల్ ప్రారంభం కానుంది.
Flipkart: ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్.. కళ్లు చెదిరే ఆఫర్లు.. మే నుంచే షురూ..!
Summer Sale: భానుడి భగభగలకు చెక్ పెట్టేందుకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సిద్ధమైపోయింది. మధ్యతరగతి సామాన్యుడి నుంచి టెక్ ప్రియుల వరకు అందరినీ ఆకట్టుకునేలా సాసా లేలే పేరుతో భారీ సమ్మర్ సేల్‌ను ప్రకటించింది. మే 9 నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్ , ఫ్యాషన్ విభాగాల్లో మునుపెన్నడూ లేని విధంగా డిస్కౌంట్లు లభించనున్నాయి.
కూల్ ఆఫర్లు.. హాట్ డీల్స్
ఎండల తీవ్రత దృష్ట్యా ఈ సేల్‌లో ప్రధానంగా కూలింగ్ పరికరాలపై ఫ్లిప్‌కార్ట్ దృష్టి సారించింది. బ్రాండెడ్ ఏసీలు, ఫ్రిజ్‌లు, కూలర్లపై భారీ ధరల తగ్గింపు ఉండనుంది. తక్కువ విద్యుత్ వినియోగించే ఇన్వర్టర్ ఏసీలపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు.కొత్త మొబైల్ కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం. ఐఫోన్లతో పాటు శామ్సంగ్, రియల్‌మీ వంటి పాపులర్ బ్రాండ్లపై అదిరిపోయే డీల్స్ రానున్నాయి. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు కూడా బడ్జెట్ ధరలకే లభించనున్నాయి. దుస్తులు, పాదరక్షలు , సమ్మర్ యాక్సెసరీస్‌పై 50% నుంచి 80% వరకు భారీ తగ్గింపులు ఉండనున్నాయి.
బ్యాంక్ ఆఫర్లు & అదనపు బెనిఫిట్స్
కేవలం ధరల తగ్గింపు మాత్రమే కాకుండా, కొనుగోలుదారులకు మరిన్ని ప్రయోజనాలను అందించేందుకు ఫ్లిప్‌కార్ట్ దిగ్గజ బ్యాంకులతో జతకట్టింది.HDFC, SBI, , Axis బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేసే వారికి ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు , క్యాష్‌బ్యాక్ సౌకర్యాలు లభిస్తాయి.ఖరీదైన వస్తువులను సులభ వాయిదాలలో కొనుగోలు చేసేందుకు No Cost EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్లస్ మెంబర్లకు బంపర్ ఛాన్స్: ఫ్లిప్‌కార్ట్ ప్రీమియం కస్టమర్లకు ఒక రోజు ముందుగానే, అంటే మే 8 నుంచే ఈ డీల్స్ అందుబాటులోకి రానున్నాయి.