Rajam: హామీలతో ప్రజలను మోసం చేశారు: మాజీ ఎంపీ బెల్లాన ధ్వజం!

Rajam: డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలో కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Update: 2026-08-06 12:10 GMT

Rajam: హామీలతో ప్రజలను మోసం చేశారు: మాజీ ఎంపీ బెల్లాన ధ్వజం!

రాజాం: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'జంజీ వార్' రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజాం అసెంబ్లీ పరిశీలకులు పులిరాజ్ రాజు, పార్టీ ఇన్‌చార్జి తలై రాజేష్, రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీను, నాలుగు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ ఇన్‌చార్జి తలై రాజేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలను హామీలతో మోసం చేసిందని విమర్శించారు. డీఎస్సీ నియామకాల్లో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ఎన్నికల సమయంలో యువతకు నిరుద్యోగ భృతి సహా పలు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అలాగే "సూపర్ సిక్స్" పేరుతో ప్రజలను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మాట నిలబెట్టుకోలేకపోతోందని విమర్శించారు. భోగాపురం విమానాశ్రయం, మూలపేట పోర్టు, గూగుల్ సంస్థ పెట్టుబడులు వంటి గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులను తమ ఘనతగా ప్రచారం చేసుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు, రైతులు, నిరుద్యోగ యువత కోసం చెప్పుకోదగ్గ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదని తలై రాజేష్ విమర్శించారు.aa

Tags:    

Similar News