Tekkali: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద హైడ్రామా
Tekkali: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద హైడ్రామా నడిచింది.
Tekkali: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద హైడ్రామా
Tekkali: ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియా లో అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ ను కొత్తూరు పోలీస్ స్టేషన్ కు రెండవ సారి విచరణకు హాజరు అవ్వాల్సిందిగా దువ్వాడ శ్రీనివాస్ ను నోటీసులు జారీ చేశారు.
అయితే ఉదయం నుంచి దువ్వాడ శ్రీనివాసు ఇంటి ముందు మరియు టెక్కలి మండలంలో పలుచోట్ల పోలీసులు భారీ మోహరింపు కావడం చాలా ఉద్రిక్త వాతావరణం నెలకుంది,
ఉదయం కొత్తూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు అవ్వడానికి వెళ్తున్న దువ్వాడ శ్రీనివాస్ సమయానికి పోలీస్ స్టేషన్ కి చేరకపోవడంతో నియోజకవర్గంలో హై టెన్షన్ వాతావరణం నెలకుంది,
మార్గమధ్యలో దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవడంతో తనతో పాటు వెళ్లిన అఫీషియల్ గన్ మెన్ మరియు P.A మొబైల్స్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో దువ్వాడ మిస్సింగ్ అంటూ పలు అనుమానాలకు దారి తీసింది.
దువ్వాడ శ్రీనివాస్ కి ఏమైందో ఏంటో అని తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి కూడా వీలు లేకుండా దివ్వల మాదిరి గృహనిర్బంధం చేశారు పోలీసులు.పోలీసులు తమ పట్ల చేసిన అన్యాయానికి ఇంటి ముందే బైఠాయించి దివ్వెల మాధురి నిరసన తెలిపింది,
చివరగా దువ్వాడ శ్రీనివాస్ అనారోగ్యం కారణంగా హాస్పిటల్ చేరారు అంటూ మాధురి కు తెలియడం తో అనుమానాలు కు తెర పడింది, అనారోగ్యం కారణంగానే విచారణకి హాజరు కాలేకపోయానని తమ లాయర్ ద్వారా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డికి మెసేజ్ ఇచ్చారని దివ్వెల మాధురి వివరణ ఇచ్చారు.
దువ్వాడ శ్రీనివాస్ అనారోగ్య వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన దివ్వెల మాధురి వెళ్ళారు.