Kaviti: కవిటి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ప్రవళ్లిక ముమ్మర ప్రచారం!
Kaviti: శ్రీకాకుళం జిల్లా కవిటి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మొగిలిపురి ప్రవళ్లిక బుధవారం బెహరా వీధిలో స్థానిక నాయకులు, మహిళలతో కలిసి ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Kaviti: కవిటి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ప్రవళ్లిక ముమ్మర ప్రచారం!
కవిటి: కవిటి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మొగిలిపురి ప్రవళ్లిక బుధవారం ఉదయం బెహరా వీధిలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువతతో కలిసి ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలిసి ఓటు వేసి గెలిపించాలని కోరారు. బెహరా వీధిలో ప్రచారం సందర్భంగా ప్రజలు అభ్యర్థికి ఘన స్వాగతం పలికారు. వీధిలోని ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలపై ఆరా తీసి.. పరిష్కరిస్తానని ప్రవళ్లిక హామీ ఇచ్చారు.
ముఖ్యంగా పంచాయతీలోని మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. కవిటి అభివృద్ధికి, ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. గతంలో కవిటిలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తుచేస్తూ, మరింత అభివృద్ధి పనులు చేపడతానని, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాండవ శేఖర్, పాండవ రామారావు, గ్రామస్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.