Kaviti: కవిటి మేజర్ పంచాయతీ అభ్యర్థి మొగిలిపురి ప్రవల్లిక నామినేషన్!
Kaviti: శ్రీకాకుళం జిల్లా కవిటి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మొగిలిపురి ప్రవల్లిక నామినేషన్ కార్యక్రమం ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో అట్టహాసంగా జరిగింది.
Kaviti: కవిటి మేజర్ పంచాయతీ అభ్యర్థి మొగిలిపురి ప్రవల్లిక నామినేషన్!
కవిటి: కవిటి మేజర్ పంచాయతీ అభ్యర్థి పాండవ రామారావు కుమార్తె మొగిలిపురి ప్రవల్లిక నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా బయలుదేరిన అభిమానులు, కార్యకర్తలు, గ్రామస్తులు నామినేషన్ కేంద్రానికి చేరుకుని నామినేషన్ వేశారు.
ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళలు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బెందాళం అశోక్ మాట్లాడుతూ.. కవిటి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రవల్లికకు అండగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొందల కృష్ణారావు, మాజీ జడ్పీటీసీ బీ రమేష్, మాజీ సర్పంచ్ మధుబాబు, ఎంపీటీసీ ప్రతినిధి వజ్జ రంగారావు, ఎంపీటీసీలు డీ రమణమూర్తి, ఎర్ర అన్నపూర్ణ, గ్రామ పెద్దలు బీ కామరాజు, చక్రధర్, బీ వేణుగోపాల్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.