Kanchili: తల్లి ప్రథమ వర్ధంతి నాడు రూ.30 వేలు విరాళం అందించిన దాత!
Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం కర్తలి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ పరపతి గోపాలరెడ్డి తల్లి ప్రథమ వర్ధంతి నాడు ట్రూ హాండ్స్ ఫౌండేషన్‌కు రూ.30 వేలు విరాళం అందించారు.
Kanchili: తల్లి ప్రథమ వర్ధంతి నాడు రూ.30 వేలు విరాళం అందించిన దాత!
కంచిలి: మండలంలో కర్తలి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ పరపతి గోపాలరెడ్డి గారు తన తల్లి ప్రథమ వర్ధంతి నాడు రూ. 30 వేలు "ట్రూ హాండ్స్ ఫౌండేషన్" సహాయ నిధికి అందించి తన తల్లి పై ఉన్న ప్రేమాభిమానాలు చాటుకున్నారు. ఫౌండేషన్ చేస్తున్న సేవలను గుర్తించి ఈ విరాళం వ్యవస్థాపకుడు, వైద్యుడు కృష్ణంరాజుకు తన ఛాంబర్లో అందించారు.
కన్న తల్లి అంటే దైవంతో సమానం అని వృద్ధాప్యంలో వృద్ధాశ్రమాల్లో విడిచి పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలని గుర్తు చేశారు. ఫౌండేషన్ సభ్యులు అన్నపూర్ణమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ గోపాల్ రెడ్డి, వాళ్ల కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సహాయం సమాజ సేవలో మరింత బాధ్యత పెంచిందని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కృష్ణంరాజు అన్నారు అన్నారు.