Rajam: రాజాంలో చికెన్ సెంటర్లో వ్యక్తి మృతదేహం కలకలం!
Rajam: రాజాం పట్టణంలోని శ్రీకాకుళం రోడ్డులో ఉన్న చికెన్ సెంటర్లో ఓ వ్యక్తి మృతదేహం రక్తపు మడుగులో లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Rajam: రాజాంలో చికెన్ సెంటర్లో వ్యక్తి మృతదేహం కలకలం!
Rajam: రాజాం పట్టణంలోని శ్రీకాకుళం రోడ్డులో నాయుడు వైన్స్ ఎదురుగా ఉన్న చికెన్ సెంటర్లో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే సుమారు 40 సంవత్సరాల వయస్సు కలిగిన ఓ వ్యక్తి చికెన్ సెంటర్లో ఒళ్లంతా రక్తంతో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతుడిని రాజాం పట్టణంలోని పాత మాదిగ వీధికి చెందిన వలసపల్లి రామారావు అలియాస్ బాబ్జిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
మృతుడికి భార్యతో పాటు ఇంటర్మీడియట్ చదువుతున్న కుమార్తె లాస్యప్రియ, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడు లెనిన్ ఉన్నట్లు తెలిసింది.
అయితే మృతదేహం చుట్టూ రక్తం ఉండటంతో పాటు దుస్తులపై కూడా రక్తపు మరకలు కనిపించడంతో మృతుడి మరణానికి గల కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది ప్రమాదమా, లేక మరేదైనా కారణమా అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.