Virat Kohli Record: అరుదైన మైలురాయి.. ఐపీఎల్‌ చరిత్రలోనే తొలి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ!

Virat Kohli Complete 9000 IPL Runs. క్రికెట్‌లో అద్భుతమైన రికార్డులతో దోసుకుపోతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు.

Update: 2026-04-28 08:39 GMT

Virat Kohli Record

Virat Kohli Record: క్రికెట్‌లో అద్భుతమైన రికార్డులతో దోసుకుపోతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 9000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా కింగ్ నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ 9000 రన్స్ పూర్తి చేశాడు. ఇందుకోసం కింగ్ 267 ఇన్నింగ్స్‌లు ఆడాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ 8989 పరుగులతో ఉన్నాడు. దుస్మంత చమీరా బౌలింగ్‌లో ఓ అద్భుతమైన ఫోర్ కొట్టి తన పరుగుల ఖాతాను ప్రారంభించాడు. అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 9000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత అరుణ్ జైట్లీ స్టేడియంలో అతడి పేరుతో ఉన్న పెవిలియన్ ముందు సాధించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో కోహ్లీ 8 సెంచరీలు సాధించాడు. ఇది టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధికం. అంతేకాకుండా 6000, 7000, 8000 పరుగుల మైలురాళ్లను కూడా మొదటగా చేరుకున్న బ్యాటర్ కోహ్లీనే. ఇప్పుడు 9000 పరుగులతో మరో కొత్త రికార్డు సృష్టించాడు.

ఈ అరుదైన ఘనతతో విరాట్ కోహ్లీ మరోసారి ఐపీఎల్ చరిత్రలో తన పేరు స్వర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. అతని ప్రదర్శన యువ క్రికెటర్లకు ప్రేరణగా నిలుస్తోంది. ఇక ఈ జాబితాలో రోహిత్ శర్మ 7183 పరుగులు (276 మ్యాచ్‌లు), శిఖర్ ధావన్ 6769 పరుగులు (222 మ్యాచ్‌లు), డేవిడ్ వార్నర్ 6565 పరుగులు (184 మ్యాచ్‌లు), కేఎల్ రాహుల్ 5579 పరుగులు (152 మ్యాచ్‌లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 2008 నుంచి బెంగళూరుకు విరాట్ ప్రాతినిధ్యం వహిస్తూ టోర్నమెంట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ఐపీఎల్ 2026లో కూడా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్‌లలో 328 పరుగులు బాదాడు. 54.66 సగటుతో పాటు 163.18 స్ట్రైక్‌రేట్ నమోదు చేయడం విశేషం.

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు:

విరాట్ కోహ్లీ – 8989 పరుగులు (274 మ్యాచ్‌లు)

రోహిత్ శర్మ – 7183 పరుగులు (276 మ్యాచ్‌లు)

శిఖర్ ధావన్ – 6769 పరుగులు (222 మ్యాచ్‌లు)

డేవిడ్ వార్నర్ – 6565 పరుగులు (184 మ్యాచ్‌లు)

కేఎల్ రాహుల్ – 5579 పరుగులు (152 మ్యాచ్‌లు)

Tags:    

Similar News