Vaibhav vs Starc: ఇక మిగిలింది మిచెల్ స్టార్క్ ఒక్కడే.. బుడ్డోడి దెబ్బకు ఈ ఆసీస్ స్టార్ ఎలైట్ క్లబ్‌లో చేరుతాడా?
Vaibhav vs Starc: ప్రపంచ స్థాయి బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. మొదటి బంతినే సిక్సర్ కొట్టడం రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకతగా మారింది.
Vaibhav vs Starc: ఇక మిగిలింది మిచెల్ స్టార్క్ ఒక్కడే.. బుడ్డోడి దెబ్బకు ఈ ఆసీస్ స్టార్ ఎలైట్ క్లబ్‌లో చేరుతాడా?
Vaibhav vs Starc: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రపంచ స్థాయి బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. మొదటి బంతినే సిక్సర్ కొట్టడం బుడ్డోడి ప్రత్యేకతగా మారింది. ఇప్పటికే ఈ లైట్ క్లబ్‌లో జస్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, పాట్ కమిన్స్ లాంటి అగ్రశ్రేణి పేసర్లు ఉన్నారు. ఈ స్టార్ పేసర్ల బౌలింగ్‌లో తొలి బంతినే సిక్స్ కొట్టిన వైభవ్.. తనది గాలివాటం బ్యాటింగ్ కాదని నిరూపించాడు. మరి ఈ లైట్ జాబితాలోకి మరో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ చేరుతాడో లేదో చూడాలి.
జైపుర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ ఆడతాడని తెలుస్తోంది. ఐపీఎల్ 2026లో స్టార్ పేసర్ల బౌలింగ్‌లో వైభవ్ సూర్యవంశీ తాను ఎదుర్కొనే తొలి బంతినే సిక్స్‌గా మలిచిన క్లబ్ ఒకటి క్రియేట్ చేశాడు. ఈ లిస్టులో ఇప్పటికే స్టార్ పేసర్లు ఉండగా.. ఇపుడు ఆసీస్ స్టార్ మిచెల్ స్టార్క్ వంతు వచ్చింది. నేటి మ్యాచ్‌లో వైభవ్ ఆధిపత్యం చెలాయిస్తాడా? లేదా స్టార్క్ చెలాయిస్తాడా? అన్నది చూడాలి. వైభవ్ vs స్టార్క్ పోరుగా ఢిల్లీ, రాజస్థాన్ మ్యాచ్ నిలిచింది. స్టార్క్‌తో బుడ్డోడి పోరు ఎలా ఉంటుందో అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.
వైభవ్ vs స్టార్క్ పోరుపై వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మిచెల్ స్టార్క్‌కు క్రెడిట్ ఇవ్వాలి. అతను వైభవ్ సూర్యవంశీ కోసం బాగా సిద్ధమై వస్తాడు. అతను జస్ప్రీత్ బుమ్రా కాదు' అని బిషప్ అభిప్రాయపడ్డాడు. అయితే ఈ వ్యాఖ్యలు సూర్యవంశీకి సవాల్‌గా మారే అవకాశముంది. ఇప్పటికే తన ఆటతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఈ 15 ఏళ్ల కుర్రాడు.. ఈ సవాల్‌ను కూడా స్వీకరించే అవకాశముంది. వైభవ్ బ్యాటింగ్ శైలి కూడా విభిన్నంగా ఉందని బిషప్ పేర్కొన్నాడు. 'వైభవ్ బ్యాట్ స్వింగ్ బేస్‌బాల్ స్టైల్‌లా ఉంటుంది. ప్రపంచంలోని ఉత్తమ బౌలర్లను ఎదుర్కొనే మానసిక ధైర్యం అతనిలో ఉంది' అని ప్రశంసించాడు.
వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌లో బలహీనతలు కనుగొనడం చాలా కష్టమని బిషప్ ఇయాన్ చెప్పాడు. 'కొన్ని సందర్భాల్లో బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బంతులు సూర్యవంశీని ఇబ్బంది పెట్టినా.. అదే బంతులను కూడా సిక్సర్లుగా మలుస్తున్నాడు. దీంతో బౌలర్లు అతని కోసం పలు ప్రణాళికలు అమలు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ టోర్నమెంట్‌లో ఉన్న అనుభవజ్ఞులైన బౌలర్లు కూడా ప్లాన్ A, B, C మాత్రమే కాకుండా మరెన్నో వ్యూహాలను ప్రయత్నిస్తున్నారు. యార్కర్లు, షార్ట్ బంతులు ఇలా అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇది అతని ప్రతిభకు నిదర్శనం' అని బిషప్ చెప్పుకొచ్చాడు.