Vaibhav vs Hinge: ఉప్పల్‌లో డకౌట్, జైపూర్‌లో ప్రతీకారం.. హింగేకు ఇచ్చిపడేసిన బుడ్డోడు వైభవ్!
Vaibhav vs Hinge: ఐపీఎల్ 2026లో యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ, బౌలర్ ప్రఫుల్ హింగే మధ్య జరిగిన పోరు అభిమానులను ఆకట్టుకుంటోంది.
Vaibhav vs Hinge: ఉప్పల్‌లో డకౌట్, జైపూర్‌లో ప్రతీకారం.. హింగేకు ఇచ్చిపడేసిన బుడ్డోడు వైభవ్!
Vaibhav vs Hinge: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు కేవలం మ్యాచ్‌గానే కాకుండా.. వ్యక్తిగత పోరాటంగా కూడా మారింది. ముఖ్యంగా యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ, బౌలర్ ప్రఫుల్ హింగే మధ్య జరిగిన పోరు అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఏప్రిల్ 13న ఉప్పల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ పేసర్ హింగే తన ప్రతిభను చూపించాడు. ఆ మ్యాచ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని డకౌట్ చేశాడు. అప్పటికి వైభవ్ ఐపీఎల్‌లో చెలరేగుతున్న యువ స్టార్‌గా నిలవగా.. బుడ్డోడిని సున్నాకే పరిమితం చేయడం హింగేకు పెద్ద గుర్తింపునిచ్చింది.
అయితే ఏప్రిల్ 25న జైపూర్‌లో హైదరాబాద్, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సీన్ రివర్స్ అయింది. ఈసారి బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ ప్రతీకారం తీర్చుకున్నాడు. ప్రఫుల్ హింగే వేసిన తొలి ఓవర్‌లో వైభవ్ చెలరేగాడు. వరుసగా నాలుగు బంతులు ఎదుర్కొని.. అన్నింటిని సిక్సలుగా మలిచాడు. హింగే వేసిన మొదటి ఓవర్‌లోని మొదటి బంతికి జైస్వాల్ సింగిల్ తీయగా.
వైభవ్ రెండో బంతి ఎదుర్కొని పరుగులేమి చేయలేదు. తరువాతి నాలుగు బంతుల్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ముఖ్యంగా లాంగ్-ఆన్, డీప్ స్క్వేర్ లెగ్ వైపుకు వెళ్లిన సిక్సులు అద్భుతం అనే చెప్పాలి. హింగే తన బౌలింగ్‌లో లెంగ్త్ తప్పకపోయినా.. వైభవ్ తన అద్భుత టైమింగ్, అగ్రెషన్‌తో సిక్సులు వర్షం కురిపించాడు. హింగే వేసిన తొలి ఓవర్‌లో ఏకంగా 25 పరుగులు వచ్చాయి. ఆ రోజు వికెట్ తీసాక పండగ చేసుకున్న హింగే.. ఈరోజు నిరాశ వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచులో యశస్వి జైస్వాల్ (10) త్వరగానే అవుట్ అయినా బుడ్డోడు వైభవ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఫోన్ల కంటే సిక్సులే ఎక్కువగా బాదుతూ రాజస్థాన్ స్కోరును పరుగులు పెట్టించాడు. వైభవ్ 15 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. దాంతో 6 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్ 76/1గా నిలిచింది. బౌలర్ ఎవరైనా వైభవ్ బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నాడు. దాంతో 10 ఓవర్లకు రాజస్థాన్ 112 రన్స్ చేసింది. వైభవ్ ఇప్పటికే 30 బంతుల్లో 77 రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, 9 సిక్సులు ఉన్నాయి. బుడ్డోడి జోరు చూస్తుంటే.. ఆర్ఆర్ భారీ స్కోర్ చేయడం పక్కా. ఇప్పటికే ఓ లైఫ్ దక్కిన వైభవ్ సెంచరీ వైపు దూసుకెళుతున్నాడు.