Sunrisers Hyderabad: సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్.. దూరమైన మ్యాచ్ విన్నర్
Sunrisers Hyderabad: భారీ అంచనాలతో జట్టులోకి వచ్చిన శివం మావీ, గజ్జల గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు.
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్.. దూరమైన మ్యాచ్ విన్నర్
Shivam Mavi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో ఆరెంజ్ ఆర్మీ జైత్రయాత్రకు బ్రేక్ పడేలా ఒక చేదు వార్త వినిపించింది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ గేర్‌లో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు స్టార్ పేసర్ శివం మావీ దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అయితే, ఈ సంక్షోభాన్ని కూడా ఒక అవకాశంగా మార్చుకుంటూ ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
ఒక్క మ్యాచ్ ఆడకుండానే
ఈ సీజన్ వేలంలో భారీ అంచనాలతో జట్టులోకి వచ్చిన శివం మావీ, గజ్జల గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. నేషనల్ క్రికెట్ అకాడమీలో శ్రమించినా, మ్యాచ్ ఆడే స్థాయి ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతో వైద్యులు ఆయనకు పూర్తి విశ్రాంతిని సూచించారు. కీలకమైన ప్లేఆఫ్స్ సమీపిస్తున్న తరుణంలో ఒక అనుభవం ఉన్న బౌలర్ దూరం కావడం అభిమానులను కలవరపెట్టింది.
అండర్-19 కిరాక్ బౌలర్
శివం మావీ స్థానాన్ని భర్తీ చేసేందుకు సన్‌రైజర్స్ యాజమాన్యం ఏమాత్రం ఆలస్యం చేయలేదు. అండర్-19 ప్రపంచ కప్‌లో తన బౌలింగ్‌తో ప్రపంచాన్నే ఆకర్షించిన 18 ఏళ్ల కుర్రాడు ఆర్ఎస్ అంబరీష్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రపంచ కప్‌లో 11 వికెట్లతో చెలరేగి, భారత్‌ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన అంబరీష్.. ఇప్పుడు ఐపీఎల్ వేదికపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఆర్ఎస్ అంబరీష్ కేవలం బౌలర్ మాత్రమే కాదు, అతను ఒక కంప్లీట్ ప్యాకేజీ. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ పవర్ ప్లేలో వికెట్లు తీయడం ఇతడి స్పెషాలిటీ. లోయర్ ఆర్డర్‌లో వచ్చి భారీ సిక్సర్లు బాదగల సామర్థ్యం అంబరీష్‌కు ఉంది.మావీ స్థానంలో ఒక ఆల్‌రౌండర్ రావడం వల్ల జట్టు సమతుల్యత మరింత పెరిగిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టైటిల్ దిశగా అడుగులు
ప్రస్తుతం ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 వరుస విజయాలతో సహా 12 పాయింట్లు సాధించిన హైదరాబాద్, టేబుల్‌లో మూడో స్థానంలో పటిష్టంగా ఉంది. ఇప్పుడు అంబరీష్ వంటి యువ రక్తం తోడవ్వడంతో జట్టులో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కావ్య మారన్ నమ్మకాన్ని ఈ కుర్రాడు నిలబెట్టుకుని, ఐపీఎల్ ఒత్తిడిని తట్టుకుని రాణిస్తే.. ఈసారి హైదరాబాద్ గడ్డపై మూడో ఐపీఎల్ ట్రోఫీ మెరవడం ఖాయం.
🚨 𝐎𝐅𝐅𝐈𝐂𝐈𝐀𝐋 𝐀𝐍𝐍𝐎𝐔𝐍𝐂𝐄𝐌𝐄𝐍𝐓
— SunRisers Hyderabad (@SunRisers) May 1, 2026
RS Ambrish, the ICC Under-19 Cricket World Cup 2026 winner, joins our squad as Shivam Mavi’s replacement.
Go well, Ambrish 🧡 pic.twitter.com/nherHX6l3N