Abhishek Sharma: 100కి ఆలౌట్ అయినా పర్వాలేదు, 160 స్కోర్ వద్దన్నాడు.. అభిషేక్ సంచలన వ్యాఖ్యలు!
Abhishek Sharma: అభిషేక్ శర్మ తమ దూకుడు వెనుక ఉన్న ఆలోచన విధానాన్ని వెల్లడించాడు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ టీమ్‌కు చాలా క్లియర్‌గా ఓ సందేశం ఇచ్చాడని చెప్పాడు.
Abhishek Sharma: 100కి ఆలౌట్ అయినా పర్వాలేదు, 160 స్కోర్ వద్దన్నాడు.. అభిషేక్ సంచలన వ్యాఖ్యలు!
Abhishek Sharma: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) దూకుసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో 5 విజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. మిగిలిన ఆరు మ్యాచ్‌లలో మూడు విజయాలు సాధిస్తే అధికారిక ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. చివరి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ అద్భుత ప్రదర్శన చేసింది.
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా రాజస్థాన్ 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని ఎస్‌ఆర్‌హెచ్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మ (57).. తమ దూకుడు వెనుక ఉన్న ఆలోచన విధానాన్ని వెల్లడించాడు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ టీమ్‌కు చాలా క్లియర్‌గా ఓ సందేశం ఇచ్చాడని చెప్పాడు.
'మన జట్టులో 6–7 బ్యాటర్లు ఉన్నారు. కాబట్టి ఆలోచించకుండా వెళ్లి హిట్ చేయండి. మ్యాచ్‌లో భయం లేదా ఒత్తిడి ఉండకూడదు. దూకుడుగా ఆడుతూ అవుట్ అయితే అది తప్పు కాదు. కానీ సేఫ్‌గా ఆడి 160–170 స్కోర్ చేయడం మాత్రం వద్దు' అని ఆటగాళ్లతో చెబుతాడని అభిషేక్ శర్మ వివరించాడు. 'కమ్మిన్స్ దృష్టిలో అసలు లక్ష్యం భారీ స్కోర్లు. 250 పరుగులు చేయాలని జట్టును ప్రోత్సహిస్తాడు. 100కి ఆలౌట్ అయినా పర్వాలేదు కానీ వేగంగా ఆడడం మాత్రం ఆపొద్దు' అని కమిన్స్ చెప్పాడని అభిషేక్ వివరించాడు. ఈ విధానం ఆటగాళ్లలో నమ్మకాన్ని పెంచుతూ.. ప్రత్యర్థి జట్లపై ఒత్తిడిని సృష్టిస్తోంది.
ఇంకా అభిషేక్ శర్మ చెప్పిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ప్యాట్ కమ్మిన్స్ గెలుపు విషయంలో చాలా స్పష్టంగా ఉంటాడట. '250 చేసి 249 ఇచ్చినా పర్వాలేదు. ఒక రన్ తేడాతో అయినా గెలవాలి అనే ఆలోచనతో టీమ్‌ను నడిపిస్తాడు. బౌలర్లను కూడా బాగా ఎంకరేజ్ చేస్తాడు. ప్రత్యర్థి బ్యాటర్లు భయపడేలా బౌలింగ్ చేయాలని చెబుతుంటాడు. జట్టు ఆగ్రెసివ్‌గా ఆడాలని కోరుకుంటాడు' అని అభిషేక్ పేర్కొన్నాడు. గాయం కారణంగా కమిన్స్ మొదటి 7 మ్యాచులు ఆడని విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తిరిగి జట్టులోకి వచ్చి సారథ్య బాధ్యతలు అందుకున్నాడు.
మొత్తానికి పాట్ కమ్మిన్స్ కెప్టెన్సీ శైలి సంప్రదాయాలకు భిన్నంగా ఉంది. సేఫ్ గేమ్ కంటే అటాకింగ్ గేమ్‌కు ప్రాధాన్యత ఇస్తూ, ఆటగాళ్లలో నమ్మకంను పెంచుతున్నాడు. గెలుపు కోసం ఏదైనా చేయాలనే ధైర్యాన్ని కమ్మిన్స్ సారథ్యం పెంచుతోంది. ఈ మైండ్‌సెట్‌తో ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంత దూరం వెళ్తుందో చూడాలి.