Vastu Remedy: తలరాతను మార్చే పటిక...ఇంటి గుమ్మం వద్ద ఇలా పెట్టి చూడండి

మనిషి కష్టజీవి. జీవితంలో నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాడు. ఎంత కష్టపడినా... అదృష్టం కలిసిరాకుంటే అడుగు ముందుకు పడదు. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. అందులో ఒకటి వాస్తు దోషం కూడా.

Update: 2026-05-04 02:43 GMT

Vastu Remedy: మనిషి కష్టజీవి. జీవితంలో నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాడు. ఎంత కష్టపడినా... అదృష్టం కలిసిరాకుంటే అడుగు ముందుకు పడదు. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. అందులో ఒకటి వాస్తు దోషం కూడా. మనం నివశించే ఇల్లు సరిగా లేకుంటే ఎంత కష్టపడినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మనం నివశించే ఇల్లు ఇటుకలు, సిమెంట్‌తో కట్టిన కట్టడం మాత్రమే కాదు... అది మన ప్రాణశక్తికి మూలం. ఇంట్లోకి వచ్చే గాలి వెలుతురుతో పాటు ప్రకృతి శక్తి కూడా సరైన రీతిలో ప్రవేశించినపుడే ఆ ఇంట్లో సిరిసంపదల ప్రవాహం ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మన దోషాలను తరిమికొట్టి అదృష్టాన్ని ఆహ్వానించే శక్తి ఓ చిన్న పటికకు ఉంటుంది.

ప్రధాన ద్వారం - లక్ష్మీదేవి ప్రవేశించే మార్గం

ఇంటిగుమ్మాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. మనం బయట నుంచి లోపలికి, లోపలి నుంచి బయటకు వెళ్లే సమయంలో మనతో పాటు కొన్ని శక్తులు లోపలికి ప్రవేశిస్తుంటాయి. ఇందులో కొన్ని ప్రతికూల శక్తులు కూడా ఉండొచ్చు. అలాంటి శక్తులు లోపలికి రాకుండా అడ్డుకుంటేనే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ప్రధాన గుమ్మాన్ని ఎల్లప్పుడు శుద్ధిగా, శుభ్రంగా, అనుకూల శక్తులకు నిలయంగా మార్చుకోవాలి. ఇదే లక్ష్మీదేవి ప్రవేశించే మార్గం అవుతుంది. ఈ మార్గం అపరిశుభ్రంగా, అశుచిగా ఉంటే ఇంట్లో అనారోగ్య సమస్యలు, డబ్బు నిలకడలేని సమస్యలు తలెత్తుతుంటాయి. దీనికి కారణం దిష్టి లేదా ఇంట్లోకి ప్రవేశించే ప్రతికూల శక్తులే.

పటికతో పరిహారం.. ఇలా పాటించండి!

వాస్తు శాస్త్రం ప్రకారం పటికకు ప్రత్యేక గుణం ఉంటుంది. ఈ పటిక గాలిలోని మలినాలను మాత్రమే కాకుండా ఇంటి పరిసరాల్లోని ప్రతికూల శక్తులను కూడా పీల్చివేస్తుంది. ఈ పటికను శుబ్రమైన ఎర్రని వస్త్రంలో ఉంచాలి. అనంతరం ఈ గుడ్డను మూటలా కట్టి ప్రధాన ద్వారానికి వేలాడదీయాలి. మంగళ లేదా శుక్రవారాల్లో ఉదయాన్నే స్నానం చేసి ఇంటిని శుభ్రపరిచిన అనంతరం ఈ పని చేయాలి.

ఈ చిన్న మార్పుతో అద్భుత ఫలితాలు

ఇలా పటికను ప్రధాన ద్వారానికి కట్టడం వలన పలు ఫలితాలు లభిస్తాయి. ఇందులో మొదటిది దృష్టి దోష నివారణ. మన ఇంటిపై పడే అసూయ, ఈర్ష్య వంటి చెడు చూపుల ప్రభావాన్ని ఈ పటిక మూట అడ్డుకుంటుంది. ఎనర్జీ ఫిల్టర్‌లా పనిచేస్తుంది. అంతేకాదు, ప్రతికూల శక్తులు తొలగిపోయన చోట ధనప్రవాహం పెరుగుతుంది. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో గొడవలు తగ్గిపోతాయి. శాంతి సౌభాగ్యం వెల్లివిరుస్తుంది. అయితే, ఈ పటికను ప్రతి ఆరు నెలలకు ఒకసారి మార్చాలి. పాత పటికను పారే నీటిలో ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి. ఇందులో ప్రతికూల శక్తులు ఉంటాయి కాబట్టి ఎవరైనా తొక్కితే ఆ శక్తులు వారిని ఆకర్షించే అవకాశం ఉంటుంది.

గమనికః వాస్తు శాస్త్రం ప్రకారం ఇక్కడ చెప్పిన పరిహారం సామాన్యమైనది మాత్రమే. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేందుకు జ్యోతిష్య లేదా వాస్తు నిపుణులను సంప్రదించడం మంచిది.  

Tags:    

Similar News