Pitru Dosha Remedies: పితృదేవతల విషయంలో ఈ తప్పులు చేస్తే...జీవితమంతా కష్టాలే
మనం ఎన్ని పూజలు చేసినా, ఎంత సంపాదించినా ఇంట్లో ప్రశాంతత ఉండటం లేదా? అయితే దానికి కారణం మీ జాతకంలో ఉన్న పితృదోషం కావచ్చు.
Pitru Dosha Remedies: మనం ఎన్ని పూజలు చేసినా, ఎంత సంపాదించినా ఇంట్లో ప్రశాంతత ఉండటం లేదా? అయితే దానికి కారణం మీ జాతకంలో ఉన్న పితృదోషం కావచ్చు. మరణించిన మన పితృదేవతలకు సకాలంలో తర్పణాలు, శ్రాద్ధ కర్మలు నిర్వహించకపోవడం వల్ల కలిగే ఈ దోషం.. మన జీవితాన్ని అంధకారం చేస్తుంది.
పితృదోషం వలన కలిగే ఐదు ప్రధాన సమస్యలు
పితృదోషాలు లేకుండా చూసుకోవడం చాలా అవసరం. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేకపోవడం, ఒకవేళ పిల్లలు కలిగినా అనారోగ్యంతో బాధపడటం పితృదోషానికి ప్రధాన సంకేతం. అంతేకాదు, ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలకపోవడం, వ్యాపారంలో నష్టాలు, పది రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు ఖర్చుకావడం వంటివి కూడా పితృదోషాలకు సంకేతాలే. ఇక చిన్న చిన్న విషయాలకే భార్య భర్తల మధ్య గొడవలు వస్తుండటం, పిల్లలు పెద్దల మాట వినకపోవడం వంటివి కూడా పితృదోషాలు ఉన్నాయని చెప్పడానికి సంకేతాలే. ఉద్యోగంలో పదోన్నతలు లభించకపోవడం, సమాజంలో గౌరవం తగ్గడం వంటివి కూడా పితృదోషాలకు సంకేతాలుగా చెబుతారు. కారణం లేకుండానే భయం, ఒత్తిడి, నిద్రలో చెడు కలలు రావడం వంటికి కూడా పితృదేవతల అసంతృప్తికి నిదర్శనంగా చెబుతారు. జీవితంలో అభివృద్ధి సాధించాలంటే పితృదోషాలు లేకుండా చూసుకోవాలి.
పరిష్కార మార్గాలు ఏమిటి?
పితృదోషం ఉందని భయపడాల్సిన అవసరం లేదు. భక్తితో చేసే కొన్ని పనులు వారిని శాంతింపజేస్తాయి. ప్రతినెలా అమావాస్య రోజున పితృదేవతలకు తిల తర్పణాలు వదలాలి. అంతేకాదు, ఏడాదికి ఒకసారి వచ్చే మహాలయ పక్షంలో విధిగా శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. దీంతో పాటుగా అన్నదానం, గోదానం చేయడం వలన పితృదేవదలు సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా పేదవారికి వస్త్రదానం చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. వీలైతే గయ లేదా కాశీ వంటి పుణ్యక్షేత్రాల్లో పితృకార్యాలు నిర్వహించడం ద్వారా దోష నివారణ జరుగుతుంది. పితృదేవతలు మన నుంచి పెద్దగా ఏమీ కోరుకోరు. భక్తితో కూడిన దోసెడు నీళ్లు మాత్రమే వారు కోరుకుంటారు. వారిని నిరంతరం స్మరించుకుంటూ భక్తితో ఉంటే చాలు వంశాభివృద్ధితో పాటు ఆయురారోగ్యాలతో జీవితం వర్థిల్లుతుంది.
గమనికః ఇక్కడ ఇచ్చిన సమాచారం మతవిశ్వాసాలు, నమ్మకాలపై ఆధారపడి ఇచ్చినది మాత్రమే.