Guru Purnima 2026: గురుపౌర్ణమి 2026... ఈ ఐదు వస్తువులు మీ ఇంట్లో ఉంటే... పట్టిందల్లా బంగారమే
గురు పౌర్ణమి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ ఐదు రకాలైన వస్తువులను ఇంట్లో ఉంచుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. తద్వారా జీవితంలో అనుకున్న లక్ష్యాలను తప్పకుండా చేరుకుంటారని పండితులు చెబుతున్నారు.
Guru Purnima 2026: హిందూ పరంపరలో గురువును సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు. ఆజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగులను నింపే గురుపౌర్ణమికి ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది. లక్ష్మీదేవి కటాక్షం కంటే ముందే మన ఇంట గురుకృప ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఏడాది 2026 జులై 29న వచ్చే గురుపౌర్ణమి వేళ ఒక అరుదైన గ్రహ యోగం ఏర్పడుతోంది. గురుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉంటూ పుష్య నక్షత్రంలో సంచరించడం, అదే సమయంలో సూర్యుడు కూడా పుష్య నక్షత్రంలో ఉండటం అత్యంత పవిత్రమైన సమయంగా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
రుద్రాక్ష లేదా రుద్రాక్ష మొక్క
శివాంశ సంభూతమైన రుద్రాక్ష ఆధ్యాత్మిక ఎదుగుదలకు, మానసిక ప్రశాంతతకు ప్రతీక. కేవలం రుద్రాక్షను ధరించడమే కాకుండా, ఈ రోజున ఒక రుద్రాక్ష మొక్కను ఇంటి ప్రాంగణంలో నాటడం మరింత శ్రేష్ఠం. మొక్క ఏ విధంగానైతే సహనంతో పెరుగుతుందో, మన జీవితంలో విజయాలు కూడా అలాగే సాధ సాధనతో సాధ్యమవుతాయని ఇది గుర్తుచేస్తుంది.
దక్షిణావృత శంఖం
శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిలకు అత్యంత ప్రీతిపాత్రమైనది దక్షిణావృత శంఖం. ఉత్తరాషాఢ , శ్రవణా నక్షత్రాల పవిత్ర కలయిక ఉన్న ఈ రోజున దక్షిణావృత శంఖాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం ద్వారా ధర్మబద్ధమైన సంపద, కుటుంబంలో సమతుల్యత , శాంతి సిద్ధిస్తాయి.
ఇత్తడి అశోక స్తంభం
అశోక స్తంభం కేవలం అధికారానికి చిహ్నం మాత్రమే కాదు. అది ధర్మం, న్యాయం, బాధ్యతకు సంకేతం. వ్యాపారవేత్తలు, ఉపాధ్యాయులు, అధికారులు, పరిపాలనా రంగంలో ఉన్నవారు ఇత్తడితో చేసిన అశోక స్తంభాన్ని పూజా గదిలో లేదా పని ప్రదేశంలో ఉంచుకోవడం వల్ల ఉన్నతమైన ధార్మిక విలువలతో కూడిన విజయం ప్రాప్తిస్తుంది.
పసుపు కొమ్ములు
జ్యోతిష్యశాస్త్రంలో పసుపును గురు గ్రహానికి సంకేతంగా భావిస్తారు. ఉచ్చ స్థితిలో ఉన్న బృహస్పతి అనుగ్రహం కోసం పసుపు కొమ్ములను పూజా స్థలంలో ఉంచి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి, శుభకార్యాలు దిగ్విజయంగా జరుగుతాయి. అంతేకాదు, గురుపౌర్ణమి నాడు తీసుకురావాల్సిన అత్యంత శ్రేష్ఠమైన వస్తువు భగవద్గీత, గురుగీత లేదా మీ వృత్తికి, జ్ఞానాభివృద్ధికి తోడ్పడే ఒక మంచి పుస్తకం. బుధుడు స్వక్షేత్రంలో, గురుడు ఉచ్చ స్థితిలో ఉన్న ఈ వేళ పుస్తకాన్ని కొనుగోలు చేసి చదవడం వల్ల జీవితాంతం నిలిచిపోయే నిజమైన జ్ఞాన సంపద లభిస్తుంది. మరి ఈ గురుపౌర్ణమి రోజున తప్పకుండా ఈ వస్తువులను తెచ్చి ఇంట్లో ఉంచుకోండి. తప్పకుండా అనుకున్న పనులు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.