Vastu Tips: మీ కలల్ని నెరవేర్చే కలబంద... ఇలా పెంచతే మీ ఇంట లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది

కలబంద మొక్కతో ఇంట్లోని నకారాత్మకశక్తులు, దిష్టి, శనిదోషాలను దూరం చేసుకోవచ్చు. అందం, ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా కలబంద మొక్క తీసుకొస్తుంది.

Update: 2026-05-30 03:21 GMT

Vastu Tips: సాధారణంగా ప్రతి ఇంట్లో మనకు కలబంద మొక్క కనిపిస్తుంది. అందంకోసం, ఆరోగ్యం కోసం ఈ మొక్కను పెంచుతుంటారు. కానీ, ఈ మొక్కలో ఎన్నో ఆయుర్వేద ఔషధ గుణాలున్నాయి. ఆరోగ్యమే కాదు... ఆ మొక్క మనుషుల తలరాతను కూడా మారుస్తుందని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు. కలబంద మొక్కకు ముక్కోటి దేవతల అనుగ్రహం ఉంటుందని, ఈ మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెబుతారు. అయితే, ఈ మొక్కను సరైన దిశలో ఇంట్లో నాటి, కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేయడం వలన దరిద్రం మొత్తం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయని పండితులు చెబుతున్నారు. మరి ఈ మొక్క విషయంలో ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం.

కలబంద మొక్కను ఏ దిక్కున ఉంచాలి?

చాలామంది కలబందను బాల్కనీలోనో లేదా మేడపైనో ఖాళీ స్థలాన్ని బట్టి పెట్టేస్తుంటారు. కానీ శాస్త్రం ప్రకారం ఈ మొక్కను పెట్టడానికి రెండు నిర్దిష్టమైన దిక్కులు ఉన్నాయి. ఒకటి ఈశాన్యం లేదా వాయువ్యం. ఇంటికి శుభం కలగాన్నా, దారిద్య్రం తొలగిపోవాలన్నా కలబంద మొక్కను ఎల్లప్పుడు ఇంటికి ఈశాన్యం లేదా వాయువ్యంలో ఉంచాలి. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి ఆగ్నేయ దిక్కులో కలబంద మొక్కను ఉంచరాదు. ఇలా ఆగ్నేయంలో పెట్టడం వలన ఇబ్బందులు, కలహాలు వచ్చే ప్రమాదం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

అద్భుతమైన ఫలితాలను ఇచ్చే ప్రత్యేక పరిహారాలు

ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి పోయి, లక్ష్మీ కటాక్షం కలగడానికి వారంలో రెండు రోజులు కొన్ని పరిహారాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు శుక్రవారం రోజున ప్రదోషకాలంలో కలబంద లోపల ఉండే తెల్లని గుజ్జును తీసి శ్రీ మహాలక్ష్మికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత ఆ గుజ్జుని నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వలన అప్పులు తీరిపోతాయి. ఇక రెండోది ఇంటకి నరపీడ, దిష్టి, నకారాత్మక శక్తిని దూరం చేయడానికి మంగళవారం రోజున ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కలబంద మొక్క వేళ్లు పైకి, ఆకులు కిందకు ఉండేలా దారాన్ని కట్టి దానిని ఇంటి ప్రధాన గుమ్మానికి వేలాడదీయాలి. ప్రధాన ద్వారం నుంచి లోపలికి బయటకు వెళ్లేవారి తలపై ఉన్న వెంట్రుకలకు ఈ మొక్క తగిలేలా ఉండాలి. ఇలా చేయడం వలన నరపీడలు, దిష్టి, శనిదోషాలన్నీ తొలగిపోతాయి.

గమనిక: ఈ సమాచారం పాఠకుల ఆసక్తి కోసం ఇచ్చినవి మాత్రమే. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం వాస్తు నిపుణులను సంప్రదించండి. 

Tags:    

Similar News