Viral: కాలు విరిగిందని వెళ్తే హార్ట్‌కి సర్జరీ చేశారు.. తీరా చూస్తే.. కొద్దిసేపటికే.!

హర్యానాలోని పానిపట్‌లో డాక్టర్ల దారుణ నిర్లక్ష్యం ఒక మహిళ ప్రాణాలను బలిగొంది. ప్రమాదంలో కాలు విరిగి ఆసుపత్రికి వెళ్లిన గుడ్డి దేవి అనే మహిళకు వైద్యులు హార్ట్ సర్జరీ చేసినట్లు కుటుంబసభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

Update: 2026-07-30 12:55 GMT

Viral: కాలు విరిగిందని వెళ్తే హార్ట్‌కి సర్జరీ చేశారు.. తీరా చూస్తే.. కొద్దిసేపటికే.!

Viral: వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రుల్లో చోటుచేసుకుంటున్న కొన్ని ఘటనలు సామాన్య ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. హర్యానాలోని పానిపట్‌లో డాక్టర్ల తీవ్ర నిర్లక్ష్యం కారణంగా ఒక మహిళ దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన గుడ్డి దేవి అనే మహిళకు, వైద్యులు హార్ట్ సర్జరీ చేసినట్లు ఆమె కుటుంబసభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సరైన సమాచారం ఇవ్వకుండా, కనీసం అనుమతి తీసుకోకుండా ఈ ఆపరేషన్ చేయడం వల్లనే ఆమె మరణించిందని ఆరోపిస్తున్నారు.

బాధితురాలికి కాలు విరిగిన చికిత్స అందించాల్సి ఉండగా, గుండె శస్త్రచికిత్స చేయడం వెనుక ఆసుపత్రి సిబ్బంది అజాగ్రత్త స్పష్టంగా కనిపిస్తోందని బాధితురాలి బంధువులు మండిపడుతున్నారు. శస్త్రచికిత్స జరిగిన కొన్ని గంటల్లోనే ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమకు న్యాయం చేయాలని, బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబసభ్యులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు.

కాగా, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిష్పాక్షికంగా దర్యాప్తు చేపడుతున్నారు. మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ వివాదాస్పద ఘటనపై ఆసుపత్రి సిబ్బంది, యాజమాన్యం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

Tags:    

Similar News