Viral: నుదిటిపై తిలకం దిద్దాడు.. కేవలం 3 గంటల్లో ఎంత సంపాదించాడో తెలిస్తే.!
Viral Video: రిషికేశ్‌లో ఓ కంటెంట్ క్రియేటర్ చేసిన వినూత్న ప్రయోగం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Viral: నుదిటిపై తిలకం దిద్దాడు.. కేవలం 3 గంటల్లో ఎంత సంపాదించాడో తెలిస్తే.!
Viral: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో ట్రెండ్ అవుతుందో ఊహించడం చాలా కష్టం. వ్యూస్ కోసం, లైక్స్ కోసం కొందరు క్రియేటర్లు చేసే ప్రయోగాలు ఒక్కోసారి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా ఓ కంటెంట్ క్రియేటర్ రిషికేశ్‌లో చేసిన ఒక వినూత్న ప్రయోగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన రిషికేశ్‌కు ప్రతిరోజూ దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. అక్కడికి వెళ్లిన ఓ యూట్యూబర్ చేతిలో పసుపు, కుంకుమ ఉన్న పళ్లెం పట్టుకుని దారిన పోయే ప్రతి ఒక్కరి నుదుటిపై ఎంతో భక్తిశ్రద్ధలతో తిలకం దిద్దడం ప్రారంభించాడు. ఇలా నుదుటిన బొట్టు పెట్టిన తర్వాత చాలామంది భక్తులు తమ ఇష్టపూర్వకంగా అతనికి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. కొందరు పది రూపాయలు, యాభై రూపాయలు ఇస్తే, మరికొందరు ఏకంగా వంద రూపాయల వరకు తమకు తోచినంతగా విరాళంగా ఇచ్చారు. ఈ వినూత్న ప్రయోగాన్ని ఆ యువకుడు వరుసగా మూడు గంటల పాటు అలాగే కొనసాగించాడు.
ఆ తర్వాత తాను ఆ మూడు గంటల వ్యవధిలో ఎంత సంపాదించాడో కెమెరా ముందు లెక్కపెట్టి చూపించాడు. కేవలం నుదుటిపై తిలకం దిద్దడం ద్వారా అతనికి భారీ స్థాయిలోనే ఆదాయం రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ప్రజలు ఎంత సులభంగా డబ్బులు ఇస్తారో నిరూపించేందుకే తాను ఈ వీడియో చేసినట్లు ఆ క్రియేటర్ వివరించాడు. ఆధ్యాత్మిక భావనతో అమాయక ప్రజలు ఇచ్చే డబ్బులతో ఇలా ఈజీగా సంపాదించవచ్చని ఈ ప్రయోగం నిరూపించింది. అయితే కొందరు నెటిజన్లు ఇది మంచి ఆలోచన అని మెచ్చుకుంటుంటే, ఇంకొందరు మాత్రం భక్తిని కూడా ఇలా ఆదాయ మార్గంగా మారుస్తున్నారని విమర్శిస్తున్నారు.