Viral: కొడుకుకు రూ. 15 లక్షల జీతం.. అయినా తిట్టిపోసిన తండ్రి.. ఎందుకో తెలుసా.!

Viral: కొడుకు ఏకంగా రూ. 15 లక్షల భారీ ప్యాకేజీతో ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం సాధించినా ఆ తండ్రి ఏమాత్రం సంతోషించలేదు. ఆ ప్రైవేట్ జాబ్ వదిలేసి..

Update: 2026-06-14 05:46 GMT

Viral: కొడుకుకు రూ. 15 లక్షల జీతం.. అయినా తిట్టిపోసిన తండ్రి.. ఎందుకో తెలుసా.!

Viral: మన దేశంలో మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎంతో మక్కువ. జీతం తక్కువైనా పర్వాలేదు కానీ, జీవితకాలం పాటు జాబ్ సెక్యూరిటీ ఉంటుందనేది వారి ప్రధాన ఆలోచన. సరిగ్గా ఇలాంటి ఆలోచనే ఉన్న ఓ తండ్రి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. ఒక యువకుడు కష్టపడి చదివి, ఓ ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో ఏకంగా రూ. 15 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. కొడుకు అంత మంచి ప్యాకేజీతో జాబ్ కొట్టాడని ఇంట్లో వాళ్లంతా సంతోషిస్తుంటే, తండ్రి మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతేకాకుండా, ఆ ప్రైవేట్ ఉద్యోగాన్ని పక్కనపెట్టి, ప్రభుత్వ ఉద్యోగం కోసం మళ్లీ ప్రయత్నించాలని కొడుకుపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు.

ఆ తండ్రి అలా వ్యవహరించడానికి ప్రధాన కారణం.. ఇటీవలి కాలంలో ఐటీ రంగంలో జరుగుతున్న పరిణామాలే. పెద్ద పెద్ద కంపెనీలు సైతం వేలాది మంది ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తీసేస్తుండటం ఆయనను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఎంత పెద్ద ప్రైవేట్ ఉద్యోగం అయినా ఎప్పుడు ఊడుతుందో తెలియదని, కేవలం 'గవర్నమెంటు జాబే రియల్' అని ఆయన మనసులో బలంగా ఫిక్స్ అయిపోయారు.

ఈ ఘటనను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ఆ తండ్రి భయాన్ని అర్థం చేసుకుని ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ప్రైవేట్ సెక్టార్‌లో జాబ్ సెక్యూరిటీ లేదన్నది వాస్తవమేనని, లేఆఫ్స్ భయం తండ్రికి ఉండటం సహజమేనని అంటున్నారు.

మరికొందరు మాత్రం.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రూ. 15 లక్షల ప్యాకేజీ రావడం చాలా కష్టమని, ఇలాంటి మంచి అవకాశాన్ని వదులుకుని ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి కూర్చోవడం అవివేకమని కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News