Viral Video: ఇదేం పిచ్చండీ బాబూ.! ఏకంగా సమోసాల కోసం కొట్టుకున్న కస్టమర్లు..

సాధారణంగా సమోసాలు తినడం అంటే అందరికీ ఇష్టం. కానీ, పూణేలోని ఒక స్వీట్ షాపులో సమోసాల కోసం క్యూలో నిలబడటం విషయంలో కస్టమర్ల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, హింసాత్మక గొడవకు దారితీసింది.

Update: 2026-07-17 16:15 GMT

Viral Video: ఇదేం పిచ్చండీ బాబూ.! ఏకంగా సమోసాల కోసం కొట్టుకున్న కస్టమర్లు..

Viral Video: పూణేలోని ఒక ప్రముఖ స్వీట్ షాపులో వింతైన ఘటన చోటుచేసుకుంది. సమోసాల కోసం ఇద్దరు కస్టమర్ల మధ్య ప్రారంభమైన చిన్నపాటి వివాదం దాడులకు దారితీసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

చిన్న చిన్న విషయాలకే కోపానికి గురై దాడులకు పాల్పడే ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. తాజాగా పూణేలోని ఒక స్వీట్ షాపులో సమోసాల కోసం జరిగిన దారుణమైన గొడవ ఈ ధోరణికి నిదర్శనంగా నిలిచింది. షాపులో సమోసాల ఆర్డర్ ఎవరు ముందు తీసుకోవాలనే విషయంలో ఇద్దరు కస్టమర్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. "నాకే ముందు సర్వ్ చేయాలి" అని ఒకరంటే, కాదు "నాకే ముందు ఇవ్వాలి" అని మరొకరు పట్టుబట్టారు.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కోపం హద్దులు దాటింది. కేవలం మాటలతో ఆగకుండా, పరస్పరం దాడి చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. షాపులోని వస్తువులను విసిరేస్తూ, ఒకరిపై ఒకరు చేతులు చేసుకున్నారు. అక్కడ ఉన్న మిగతా కస్టమర్లు, షాపు సిబ్బంది వారిని వారించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ హఠాత్ పరిణామంతో స్వీట్ షాపులో కొద్దిసేపు తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

కాగా, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు తమ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారింది. కేవలం సమోసాల కోసం ఇంతలా దారుణంగా కొట్టుకోవాలా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి సహనం లేకపోవడం వల్లనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించారు.

Tags:    

Similar News