Siddipet: సిద్దిపేట కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా రషాద్ నియామకం

Siddipet: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా రయీసుద్దీన్ రషాద్ నియమితులయ్యారు.

Update: 2026-06-16 15:25 GMT

Siddipet: సిద్దిపేట కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా రషాద్ నియామకం

Siddipet: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా రయీసుద్దీన్ రషాద్‌ను నియమించినట్లు రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన రయీసుద్దీన్ రషాద్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ గారికి, జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారికి కృతజ్ఞతలు తెలిపారు.నా పదవికి రావడానికి సహకరించారు.

సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గౌరవనీయులు పూజల హరికృష్ణ అన్న గారికి మరియు సిద్దిపేట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు అత్తు ఇమామ్ అన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. పార్టీ బలోపేతానికి కట్టుబడి పనిచేస్తూ మైనారిటీ వర్గాల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Tags:    

Similar News