Doolmitta: గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ శ్రీరాములు బిక్షపతి మృతి
Doolmitta: సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం కూటిగల్ గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ శ్రీరాములు బిక్షపతి గుండెపోటుతో హైదరాబాద్‌లో కన్నుమూశారు.
Doolmitta: గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ శ్రీరాములు బిక్షపతి మృతి
దూల్మిట్ట: గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందిన విషాద ఘటన సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని కూటిగల్ గ్రామానికి చెందిన శ్రీరాములు బిక్షపతి (46) ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వర్తించారు.
ఆదివారం ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు బిక్షపతి తుదిశ్వాస విడిచారు.
బిక్షపతి మృతితో ఆయన స్వగ్రామమైన కూటిగల్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల గ్రామస్తులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.