Siddipet: రాజీవ్ గాంధీ ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం: పూజల హరికృష్ణ!
Siddipet:మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పూజల హరికృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Siddipet: రాజీవ్ గాంధీ ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం: పూజల హరికృష్ణ!
సిద్ధిపేట: మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం అని ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ చేసిన కృషి చిరస్మరణీయం అని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజవర్గం ఇంచార్జీ పూజల హరికృష్ణ గారు పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు అన్నారు.
సిద్ధిపేట లో మాజీ ప్రధానమంత్రి భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పొన్నాల వద్ద ఉన్న రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజవర్గం ఇంచార్జీ పూజల హరికృష్ణ గారు పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు మాట్లాడుతూ యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యం కల్పించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశ అభివృద్ధికి వినియోగించాలనే దృక్పథంతో రాజీవ్ గాంధీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అని అన్నారు.
కంప్యూటరీకరణ టెలికమ్యూనికేషన్ రంగాల విస్తరణకు ఆయన హయాంలో ప్రత్యేక ప్రాధాన్యం లభించింది అని అన్నారు. ఓటు హక్కు వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు అని 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి దక్కింది అని అన్నారు. రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యం కల్పించిన మహోన్నతమైన నాయకుడు రాజీవ్ గాంధీ గారు అని కొనియాడారు.
యువత అభివృద్ధే దేశ అభివృద్ధి అని 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించడం ద్వారా ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితోనే SIR ప్రక్రియ జరుగుతున్నది అని అన్నారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో గంప మహేందర్ రావు ముద్దం లక్ష్మి బొమ్మల యాదగిరి తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.