Cherial: చేర్యాలలో అక్రమ నిర్మాణాలు అధికారుల ఉదాసీనతపై స్థానికుల ఆగ్రహం!

Cherial: చేర్యాలలో నిబంధనలకు విరుద్ధంగా బాలాజీ థియేటర్ ప్రహరీ గోడ నిర్మాణం. అధికారులు, పాలకమండలి పట్టించుకోవడం లేదని స్థానికుల మండిపాటు.

Update: 2026-08-17 07:35 GMT

Cherial: చేర్యాలలో అక్రమ నిర్మాణాలు అధికారుల ఉదాసీనతపై స్థానికుల ఆగ్రహం!

Cherial: చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మానాలు.చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు పాలక మండలి.

చేర్యాల పట్టణ కేంద్రం లోని బాలాజీ ధియేటర్ కొన్ని రోజుల నుండి మూత పడి ఉంది ఇటీవల ఒక షో రూమ్ కు లీజుకు ఇవ్వడం జరిగింది చుట్టూ ఉన్న ప్రహరీ గోడ శితిలావాస్థిలో ఉండడంతో దానిని కూల్చిరాత్రికి రాత్రే నూతనంగా ప్రహరీ గోడ నిర్మించారు నిబంధనల ప్రకారం 30 ఫిట్లు వెనక్కి జరిగి నిర్మానాలు చేపట్టాలి.

చేర్యాల నుండి కొన్ని గ్రామాలకు ప్రధాన రహదారి కావడం తో ఎవరు నిర్మానాలు చేపట్టిన రోడ్డు మధ్య లో నుండి 30ఫిట్లు వదిలి నిర్మానాలు చేపట్టాలని మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు కానీ ఇవి ఏమి పట్టనట్టుగా కేవలం 15 ఫిట్లు వదిలి ప్రహరీ నిర్మించడం జరిగింది.

ఇలా జరుగుతే రోడ్డు ఇరుకై వచ్చి పోయే వాహనాలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు స్థానికులు కోరుతున్నారు.

Tags:    

Similar News