Razole: రాజోలులో టీడీపీ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య ఇంటింటి ప్రచారం

Razole: కూటమి ప్రభుత్వం రెండేళ్ల సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించిన రాజోలు టీడీపీ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య. కూనవరంలో ఇంటింటి ప్రచారం.

Update: 2026-08-08 11:18 GMT

Razole: రాజోలులో టీడీపీ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య ఇంటింటి ప్రచారం

రాజోలు: కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేసి, ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

శనివారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం కూనవరం గ్రామంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటినీ సందర్శించి, కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అదే సమయంలో ప్రజల సమస్యలు, అవసరాలు, స్థానిక మౌలిక వసతుల పరిస్థితిపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా గొల్లపల్లి అమూల్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలన కారణంగా రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, లోటు బడ్జెట్ పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగుతోందన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

ప్రజలకు మెరుగైన రహదారులు, తాగునీటి సౌకర్యాలు కల్పించడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సంక్షేమం తదితర అన్ని రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడమే ఇంటింటి ప్రచారం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ భూపతి రాజు ఈశ్వర్ రాజు వర్మ, రాజోలు మండల పార్టీ అధ్యక్షులు అనుచూరి సునీతారామ పురుషోత్తం, మలికిపురం మండల పార్టీ అధ్యక్షుడు అడబాల సాయిబాబా, రాజోలు మండల ప్రధాన కార్యదర్శి ఆరుమిల్లి భాను సుధాకర్, కూనవరం గ్రామ శాఖ అధ్యక్షులు చెల్లింగి జానకిరామయ్య, గ్రామ ప్రధాన కార్యదర్శి గెద్దాడ మణికంఠ, బూత్ కమిటీ సభ్యులు కాండ్రేగుల చంటి, మల్లిపూడి నరసింహారావు, బోనం నారాయణస్వామి, పొన్నపల్లి సత్యనారాయణ, ముచ్చుపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News