Malikipuram: తూర్పుపాలెంలో వైభవంగా నీలపల్లమ్మ అమ్మవారి సారె వేడుకలు!
Malikipuram: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో గ్రామదేవత నీలపల్లమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా గ్రామస్తులు ఘనంగా సారె సమర్పించారు.
Malikipuram: తూర్పుపాలెంలో వైభవంగా నీలపల్లమ్మ అమ్మవారి సారె వేడుకలు!
Malikipuram: డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం, తూర్పుపాలెం గ్రామదేవత నీలపల్లమ్మ అమ్మవారికి గ్రామస్తులు ఆదివారం సారె సమర్పించారు. ఆషాఢమాసం సందర్భంగా గ్రామస్తులు భారీ సంఖ్యలో వివిధ రకాల మిఠాయిలను తీసుకువచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు.
ఈ సందర్భంగా మరమరాలు, బెల్లంతో తయారు చేసిన రోలు, రోకలి, తిరగలి తదితర ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.